Articles Posted by the Author:

 • భూమి పూజ ఓకే.. ఇంతకీ భూమి ఎక్కడిది?

  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రాంతం అది. అక్కడ భూమి కొనాలంటే సామాన్యుడి వల్ల కాదు. అలాంటి ఏరియాలో ఏకంగా 2ఎకరాలు కొన్నారు పవన్. తన సొంత ఇంటికి భూమి పూజ చేశారు. అంతా బాగానే ఉంది. పవన్ లాంటి వ్యక్తి 2ఎకరాలు కొనడం పెద్ద సమస్య కాదని అంతా సర్దిచెప్పుకోవచ్చు. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఎలా సాధ్యం అనే ప్రశ్న పుట్టక మానదు. “నా దగ్గర డబ్బులు లేవు. నా సిబ్బందికి జీతాలివ్వడమే […]


 • జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా? : సీఎం కేసీఆర్

  శాసనసభలో సీఎం కేసీఆర్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభ నుంచి జానారెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదు అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జానారెడ్డిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. నిన్న జానారెడ్డి ఏం చేశారో మీకు తెలుసా? మా దగ్గర రిపోర్టులు లేవా? ఉట్టిగానే సస్పెండ్ చేస్తామా? జానారెడ్డిపై తమకు గౌరవం లేదా? అని కిషన్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం ప్రశ్నల వర్షం కురిపించారు. […] • రెండు వ్యాన్ల నిండా నోట్ల కట్టలను బయటకు

  పాములు పెట్టిన పుట్టల్లా డేరా బాబా ఆశ్రమం గుట్టు తవ్వినకొద్దీ బయటకు వస్తూనే ఉంది. గత ఏడాది ఆగస్టు 26న సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం నుంచి రెండు వ్యాన్ల నిండా నోట్ల కట్టలను బయటకు తరలించారు. అత్యాచారం కేసులో పంచకులలోని సీబీఐ కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని డేరా ఐటీ విభాగం అధిపతి వినీత్ కుమార్ హర్యానా పోలీసులకు వెల్లడించారు. డేరా […]


 • రాజకీయ దృష్టితో కాకుండా ప్రజల కోసం పనిచేశామని

  విభజన హామీల అమలును కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళనల నడుమ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఎలాంటి సమస్యలు రాలేదని, వాజ్‌పేయి హయాంలో అప్పటి ప్రభుత్వం రాజనీతిజ్ఞతతో వ్యవహరించిందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. రాజకీయ దృష్టితో కాకుండా ప్రజల కోసం పనిచేశామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నిప్పులు చెరిగారు. ఆ పార్టీ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగడుతూ చెలరేగిపోయారు. కాంగ్రెస్‌ చేసిన […]


 • పద్మావత్‌’కు మరో షాక్‌ : ఎఫ్‌బీలో ఫుల్‌ మూవీ లీక్‌

  ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల మధ్య సంజయ్‌ లీలా భన్సాలీ మూవీ ‘పద్మావత్‌’ నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు కర్ణిసేన ఆందోళనలతో తీవ్ర చిక్కుల్లో కూరుకున్న ఈ మూవీకి, ఓ ఫేస్‌బుక్‌ పేజీ కూడా తీవ్ర షాకిచ్చింది. పద్మావత్‌ ఫుల్‌ మూవీని ఫేస్‌బుక్‌లో లీక్‌ చేసింది. ‘ జాటోన్‌ కా అడ్డ’ అనే ఫేస్‌బుక్‌ పేజీ, థియేటర్‌లో స్క్రీన్‌ అవుతున్న ఈ మూవీని లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. ఇలా లైవ్‌ స్ట్రీమ్‌ అవుతున్న సమయంలోనే […]


 • జూనియర్ ఐపీఎస్‌తో లవ్ మ్యారేజ్

  వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి ఢిల్లీకి చెందిన 2011 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 18న వీరి పెళ్లి ఢిల్లీలో జరగనుందని సమాచారం. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని […]


 • ఆమె పాదయాత్ర 3,800 కిలోమీటర్లు

  కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు అంటే దేశ దక్షిణ మూల నుంచి ఉత్తర కొన వరకు బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే వారిని మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. తీర్థ యాత్రల కోసం, ప్రకతి వీక్షణ కోసమో అలాంటి వారు ప్రయాణిస్తుంటారు. వారందరికి భిన్నంగా సృష్టి భక్షి అనే యువతి కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబర్‌ 14వ తేదీన కశ్మీర్‌లోని శ్రీనగర్‌ వరకు పాదయాత్రను ప్రారంభించారు. అదీ ఓ సమున్నతాశయం కోసం. దేశంలోని మహిళలను సంపూర్ణ సాధికారత […]


 • దేశంలో మూలుగుతున్న నల్లడబ్బు

  దేశంలో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీయడంతోపాటు విదేశాల్లో పెరుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సాక్షాత్తు నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. దేశంలో దాదాపు 3.75 లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు, విదేశాల్లో దాదాపు లక్ష కోట్ల రూపాయల నల్ల డబ్బు ఉందని అప్పటివరకున్న అధికారిక అంచనా. విదేశాల్లో పేరుకుపోతున్న నల్లడబ్బును తీసుకరావడానికి ఆయన ప్రభుత్వం ‘అన్‌ డిస్‌క్లోజ్డ్‌ ఫారిన్‌ ఇన్‌కమ్‌ అండ్‌ అసెట్స్‌ (ఇంపోజిషన్‌ ఆఫ్‌ టాక్స్‌) బిల్లు–2015’ను తీసుకొచ్చింది. దీన్ని […]


 • తెలంగాణ గౌరవానికి ప్రతీక

  కనులపండువగా తెలుగు మహాసభల నిర్వహణ అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరికీ చక్కటి ఆతిథ్యమివ్వాలి భాష, సాహిత్యాలకు ప్రాధాన్యం జ్ఞాన్‌పీఠ్‌ పురస్కార గ్రహీతలకు సన్మానం ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తెలంగాణ గౌరవానికి ప్రతీక అని, కన్నులపండువగా కార్యక్రమాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇదో బృహత్కార్యమని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ప్రముఖులు హాజరవుతున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు […]