Articles Posted in the " Crime " Category

 • ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం

  కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షసులు ముక్కు పచ్చలారని ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమర్చారు. పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. తన పుట్టిన రోజు వేడుకలకు స్నేహితులను ఆహ్వానించిన చిన్నారి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉండటం ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…  రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రాజు-ప్రవళిక దంపతులు ఏకైక కుమార్తె ఈర్ల రేష్మ(7) […]


 • తమిళనాట భారీ వర్షాలు

  తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన గంటల్లోనే రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలతో పాటు చెన్నై నగరంలో వర్షాలు మొదలయ్యాయి. దీనికి ‘ఓఖి’ తుపాను తోడవటంతో కన్యాకుమారి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సుమారు 500 చెట్లు రోడ్లకు అడ్డంగా పడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పెద్దసంఖ్యలో విద్యుత్తు స్తంభాలు ఒరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపేశారు. తుపాను కారణంగా కన్యాకుమారితో పాటు పలుప్రాంతాల్లో మొత్తం అయిదుగురు […]


 • హైదరాబాద్ వీధుల్లో కరోడ్‌పతి బెగ్గర్స్

  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు (గ్లోబల్ సమ్మిట్) ఈనెలాఖరులో జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో భిక్షాటనను నిషేధించారు. ఈ నిషేధంతో నగర వ్యాప్తంగా ఉన్న బిచ్చగాళ్లను అదుపులోకి తీసుకుని చ‌ర్ల‌ప‌ల్లి ఓపెన్ జైల్లో ఉన్న ఆనందాశ్ర‌మానికి త‌ర‌లించారు.   అక్క‌డ వాళ్లంద‌రి వివరాల‌ను న‌మోదు చేస్తున్న‌పుడు […]


 • నటిపై దాడి, అత్యాచారం కేసులో=ఏకంగా ఎనిమిదో స్థానానికి తగ్గించారట

  నటిపై దాడి, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు అయిన మలయాళ స్టార్ హీరో దిలీప్ కు ఒక్కో చిక్కుముడీ వీడుతున్నట్టుగా ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టై దాదాపు అరవై రోజుల పాటు జైల్లో గడిపిన ఈ స్టార్ హీరోకి కొన్నాళ్ల కిందట బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దిలీప్ ను అన్ని రోజుల పాటు జైల్లో పెట్టినప్పటికీ పోలీసులు సరైన సాక్ష్యాధారాలు ఏవీ సంపాదించలేదనే ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది. ఇన్నాళ్లూ ఈ కేసులో ప్రథమ […]


 • శశికళ ఆస్తులు రూ. 5 లక్షల కోట్లు.. ఐటీ దాడుల్లో బయటపడిన కళ్లు చెదిరే వాస్తవం!

  శశికళ బంధుగణంపై మరోమారు దాడులకు సిద్ధమవుతున్న ఐటీ దేశవ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకున్న శశికళ 240 బ్యాంకు లాకర్లు గుర్తింపు జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, బినామీలు, అనుచరగణంపై ఇటీవల దాడిచేసిన ఐటీ అధికారులు తాజాగా మరోమారు దాడులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించిన ఐటీ మరోమారు దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. శశికళ, ఆమె […]


 • ప్రధానులూ పదవీచ్యుతులయ్యారు

  పనామా పత్రాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల పేర్లు బట్టబయలు పలు దేశాల్లో నేటికీ కొనసాగుతున్న విచారణ.. రెండేళ్ల క్రితం పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. నాటి పత్రాల దెబ్బకు ఏకంగా ఇద్దరు ప్రధానులూ పదవీచ్యుతులయ్యారు. అనేక సంస్థలు మూతపడ్డాయి. కొందరు ప్రముఖులు, సంస్థలపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ప్యారడైజ్‌ పత్రాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరోసారి పనామా పత్రాల వ్యవహారం అందరికీ గుర్తుకొస్తోంది. మనదేశంలోనూ కుదుపు […]


 • దురదృష్టవశాత్తూ దేశంలో

  దురదృష్టవశాత్తూ దేశంలో లెక్కకుమించి నేరాల్లో ముద్దాయిలుగా ఉన్నవారే కాదు, వ్యాపార సామ్రాట్టులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. వారే అత్యంత కీలకమైన పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో చేరి తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. ఇప్పటికైనా మన ప్రయాణంతో పాటు, ప్రమాణాలను మార్చుకుంటూ సమకాలీన సమాజపు సవాళ్లకు దీటుగా స్పందించాల్సిన సమయమిది.  దేశ రాజకీయాలను నేర రహితం చేసే కీలక ఘట్టానికి సుప్రీంకోర్టు శ్రీకారం చుట్టింది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయనేతలపై విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం […]


 • బినామీల్లో వణుకు

  2015 అక్టోబర్ 29న ఆత్మహత్య చేసుకున్న కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాద్‌రావు కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుపాలైన ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో శుక్రవారం కోర్టు తీర్పు కీలక మలుపు తిరిగింది. ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తూ కోట్లకు పడగలెత్తిన ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి వడ్డీకి వడ్డీ వసూలు చేస్తూ స్థిరాస్తులు భారీగా కూడబెట్టాడు. ప్రసాద్‌రావు కేసులో అరెస్టయిన మోహన్‌రెడ్డిపై వరుసగా ఫిర్యాదులు రావడంతో కేసును సీఐడీకి అప్పగిస్తూ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే జైలుకు […]


 • ఒక్కో వారం… ఒక్కో నేరం=శనివారమే అత్యధిక నేరాలు

  సిటీలో నేరాల తీరుపై పోలీసులు అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తున్నారు. ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రతి ఏడాది గణాంకాలను సైతం పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు నమోదైన సొత్తు సంబంధిత నేరాల గణాంకాలను వెలికితీయగా.. శనివారమే ఎక్కువ క్రైమ్స్‌ జరిగినట్లు తేల్చారు. వీటిలో ఒక్కో వారం, ఒక్కో తీరు నేరం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. సిటీలో ‘హైదరాబాద్‌ కాప్‌’ ద్వారా నేరాల తీరును గుర్తిస్తున్న అధికారులు కారణాలు విశ్లేషిస్తూ నిరోధానికి […]


 • తాను పప్పు అన్నం తినన=చికెన్‌ మటన్‌ బిర్యానీ, కోడిగుడ్లు డిమాండ్‌

   ముంబైకి చెందిన మన్సూర్‌ షేక్‌ అమెరికాలో ఉంటూ అక్కడ హైదరాబాద్‌కు చెందిన యువతిని వేధించాడు… దీంతో బాధితురాలు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండియాకు డిపోర్ట్‌ అయ్యాడు… ముంబై కేంద్రంగా ఆమె కుటుంబీకులకూ నరకం చూపడం ప్రారంభించాడు.. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు… న్యాయస్థానం అనుమతితో బుధవారం కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీసులకు ‘కష్టాలు’ మొదలయ్యాయి… భోజనంతో పాటు ఇతర అంశాల్లో మన్సూర్‌ కోరికలు చూసిన అధికారులు […]