Articles Posted in the " Political " Category

 • నాది ఉడుంపట్టు

  పోలవరం పూర్తి చేసే సలహాలే వింటా అడ్డుకోవాలనుకుంటే లెక్కే చేయను గడ్కరీ సహకరిస్తామన్నారు.. రమ్మంటే దిల్లీ వెళ్తా.. గుత్తేదారుల కన్సార్టియం ఏర్పడుతోంది.. ‘పోలవరంపై ఉడుంపట్టు నాది. వదిలిపెట్టను. ప్రాజెక్టును పూర్తి చేసి తీరతా..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ‘రూపాయి అవినీతి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఎవరైనా దీని నిర్మాణం పూర్తి చేసేలా సలహాలు ఇస్తే వింటా. అడ్డుకుందామని చూస్తే లెక్కే చేయను’ అని కుండబద్దలు కొట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో సోమవారం ఆయన […]


 • కాంగ్రెస్‌పై నెహ్రూ కుటుంబానిదే ఆధిపత్యం

  స్వాతంత్య్ర ఉద్యమానికి వేదికగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పుడు బహుళత్వానికి మారుపేరుగా ఉండేది. స్వాతంత్య్రానికి ముందు దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన వారు ఆ పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కాగా, స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నెహ్రూ కుటుంబ సభ్యులే ఎక్కువ కాలంపాటు ఈ పదవిలో ఉన్నారు. 1947 తరువాత మొత్తం 38 ఏళ్ల పాటు నెహ్రూ కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా కొనసాగారు. అందులో ఒక్క సోనియా గాంధీయే వరుసగా 19 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం […]


 • ఆ ప్రశ్న అంతర్మథనంలో పడేసింది: పవన్‌

  తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు. తొలి విడత పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, వాటిని అవగాహన చేసుకోనున్నారు. రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో మూడో విడత పర్యటన […]


 • రాజకీయ వారసుడు.. పెరిగిన దూకుడు…

  ఎట్టకేలకు కాంగ్రెస్‌ పగ్గాలను రాహుల్‌గాంధీ చేపట్టడానికి రంగం సిద్ధమవుతోంది. అయిదేళ్ల క్రితం జయపురలో జరిగిన సమావేశంలో ‘అధికారమంటే విషం సుమా’ అని చెబుతూనే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయనకు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. భావోద్వేగం నడుమ ఆ బాధ్యతలు చేపట్టిన యువనేత ఇప్పుడా విష పాత్రను తీసుకునేందుకు సిద్ధపడాల్సి రావడం విశేషం..! ఇంతకాలం తల్లి నిర్వర్తించిన బాధ్యతల్ని వచ్చేవారం తనయుడు చేపట్టబోతున్నారు. పెద్ద బాధ్యతల్ని తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో రాహుల్‌ను గతంలో పప్పూ అంటూ విమర్శకులు ఎద్దేవా […]


 • డీడీలు కట్టని రేషన్‌ డీలర్లను తొలగించండి

  పేదలకు చేరాల్సిన రేషన్‌ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న రేషన్‌ డీలర్లను వెంటనే తొలగించండి. అధికార యంత్రాంగం ద్వారా ప్రజలకు సరకులు అందేలా చూడండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌, కమిషనర్‌ సీవీఆనంద్‌తో పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 వేల మంది డీలర్లలో 25 జిల్లాలకు చెందిన దాదాపు ఏడు వేల మంది ఇప్పటికే డీడీలు చెల్లించి సరకుల […]


 • ఆగిపోతే కట్టలేం

  పోలవరం స్పిల్‌వే పనుల టెండర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో తీవ్రంగా స్పందించారు. పోలవరం పనులు ఎంతో వేగంగా జరుగుతున్న ఈ దశలో కేంద్రం నుంచి వచ్చిన లేఖ లేనిపోని గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఈ దశలో ప్రాజెక్టు ఆగిపోతే కట్టడం కష్టమని శాసనసభలో పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లోనూ ఇదే విషయమై విలేకరులతో మాట్లాడుతూ ఇంకొంత తీవ్రంగా స్పందించారు. పిలిచిన టెండర్లను కేంద్రం నిలిపేయమంటోందని, ఇలా ఆపమంటే వారికే […]


 • ఇవాంకా రాక నేపథ్యంలో.. భారత పోలీసుల వద్ద తుపాకులే వుండకూడదంటూ అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆదేశాలు!

  వచ్చే వారంలో హైదరాబాద్ రానున్న ట్రంప్ కుమార్తె గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు హాజరు ప్రధాని మోదీతో కలసి పాల్గొననున్న ఇవాంకా యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారుల ఆంక్షలు వచ్చే వారంలో హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరు కానుండగా, ఆమె భద్రతకు సంబంధించి అమెరికా సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది. ఆమెకు భద్రతగా ఉండే ఇండియన్ పోలీసులు ఎవరి […]


 • అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై పనేంటి?: కర్ణాటక హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

  బెంగళూరులో రాత్రిపూట రోడ్లపై మహిళలు కనిపించకూడదు అర్ధరాత్రి ఆఫీసుకు వెళ్తున్న మహిళలు కుటుంబసభ్యులను వెంటబెట్టుకెళ్లాలి హోం మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటని కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో శాసనమండలిలో ‘మహిళా భద్రత’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై పని ఉండదు కనుక, ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదని అన్నారు. అంతే కాకుండా రాత్రివేళ ఆఫీసుకు వెళుతున్న ఓ […]


 • బాబు దిగిపోతేనే జాబు

  ప్రభుత్వ ఉద్యోగులకు మంచిచేస్తా.. రైతులకు అండగా నిలుస్తాం కాసుల కక్కుర్తి లేదు.. కేసులకు భయపడను జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభం డిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని.. రైతులకు వ్యవసాయం పండగ చేయాలని, అధికారంలోకి వచ్చాక మద్యపానం పూర్తిగా తీసేయాలన్న కసి నాకుంది. నేను వెళ్లిపోయాక కూడా ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలి. అవినీతి మయం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఉంది. అవినీతిలో కూరుకున్న అందరినీ జైల్లో […]


 • పెద్దఎత్తున కాయకల్పచికిత్స జరుగనుందా?=కాంగ్రెస్‌లో

  దేశవ్యాప్తంగా యువతరాన్ని ఆకర్షించేందుకు ఒకపద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ ముందుకు వెళుతున్నదా? పాతతరం అంతటికీ స్వస్తి చెప్పి కొత్తతరాన్ని ముందుకు తేనున్నదా? కాంగ్రెస్‌లో అతిత్వరలో పెద్దఎత్తున కాయకల్పచికిత్స జరుగనుందా? ఈ ప్రశ్నలకు జవాబులు రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత లభించనున్నాయి. కాంగ్రెస్‌లో పెద్దఎత్తున జరుగుతున్న ఈ భారీ మార్పులు భారతీయ జనతా పార్టీలో ప్రకంపనలు సృష్టించనున్నాయి. గత ఎన్నికల్లో యువతను ఆకర్షించి, అవినీతిని నిర్మూలించి, స్వచ్చమైన రాజకీయాలను ప్రవేశపెడతామన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వాగ్ధానాలు […]