Articles Posted in the " National " Category

 • రెండు వ్యాన్ల నిండా నోట్ల కట్టలను బయటకు

  పాములు పెట్టిన పుట్టల్లా డేరా బాబా ఆశ్రమం గుట్టు తవ్వినకొద్దీ బయటకు వస్తూనే ఉంది. గత ఏడాది ఆగస్టు 26న సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం నుంచి రెండు వ్యాన్ల నిండా నోట్ల కట్టలను బయటకు తరలించారు. అత్యాచారం కేసులో పంచకులలోని సీబీఐ కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని డేరా ఐటీ విభాగం అధిపతి వినీత్ కుమార్ హర్యానా పోలీసులకు వెల్లడించారు. డేరా […]


 • రాజకీయ దృష్టితో కాకుండా ప్రజల కోసం పనిచేశామని

  విభజన హామీల అమలును కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆందోళనల నడుమ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. గతంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఎలాంటి సమస్యలు రాలేదని, వాజ్‌పేయి హయాంలో అప్పటి ప్రభుత్వం రాజనీతిజ్ఞతతో వ్యవహరించిందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. రాజకీయ దృష్టితో కాకుండా ప్రజల కోసం పనిచేశామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నిప్పులు చెరిగారు. ఆ పార్టీ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగడుతూ చెలరేగిపోయారు. కాంగ్రెస్‌ చేసిన […]


 • పద్మావత్‌’కు మరో షాక్‌ : ఎఫ్‌బీలో ఫుల్‌ మూవీ లీక్‌

  ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల మధ్య సంజయ్‌ లీలా భన్సాలీ మూవీ ‘పద్మావత్‌’ నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు కర్ణిసేన ఆందోళనలతో తీవ్ర చిక్కుల్లో కూరుకున్న ఈ మూవీకి, ఓ ఫేస్‌బుక్‌ పేజీ కూడా తీవ్ర షాకిచ్చింది. పద్మావత్‌ ఫుల్‌ మూవీని ఫేస్‌బుక్‌లో లీక్‌ చేసింది. ‘ జాటోన్‌ కా అడ్డ’ అనే ఫేస్‌బుక్‌ పేజీ, థియేటర్‌లో స్క్రీన్‌ అవుతున్న ఈ మూవీని లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. ఇలా లైవ్‌ స్ట్రీమ్‌ అవుతున్న సమయంలోనే […]


 • జూనియర్ ఐపీఎస్‌తో లవ్ మ్యారేజ్

  వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి ఢిల్లీకి చెందిన 2011 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 18న వీరి పెళ్లి ఢిల్లీలో జరగనుందని సమాచారం. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని […]


 • దేశంలో మూలుగుతున్న నల్లడబ్బు

  దేశంలో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీయడంతోపాటు విదేశాల్లో పెరుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సాక్షాత్తు నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేశారు. దేశంలో దాదాపు 3.75 లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు, విదేశాల్లో దాదాపు లక్ష కోట్ల రూపాయల నల్ల డబ్బు ఉందని అప్పటివరకున్న అధికారిక అంచనా. విదేశాల్లో పేరుకుపోతున్న నల్లడబ్బును తీసుకరావడానికి ఆయన ప్రభుత్వం ‘అన్‌ డిస్‌క్లోజ్డ్‌ ఫారిన్‌ ఇన్‌కమ్‌ అండ్‌ అసెట్స్‌ (ఇంపోజిషన్‌ ఆఫ్‌ టాక్స్‌) బిల్లు–2015’ను తీసుకొచ్చింది. దీన్ని […]


 • కాంగ్రెస్‌పై నెహ్రూ కుటుంబానిదే ఆధిపత్యం

  స్వాతంత్య్ర ఉద్యమానికి వేదికగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పుడు బహుళత్వానికి మారుపేరుగా ఉండేది. స్వాతంత్య్రానికి ముందు దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన వారు ఆ పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక కాగా, స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నెహ్రూ కుటుంబ సభ్యులే ఎక్కువ కాలంపాటు ఈ పదవిలో ఉన్నారు. 1947 తరువాత మొత్తం 38 ఏళ్ల పాటు నెహ్రూ కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా కొనసాగారు. అందులో ఒక్క సోనియా గాంధీయే వరుసగా 19 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం […]


 • ఓట్ల యావ : మసాలా పులుముతున్న మోడీ

  మణిశంకర్ అయ్యర్ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీకి భగవత్ ప్రసాదితమైన ఒకవరం. గుజరాత్ ఎన్నికల సమరాంగణంలో ఆయన ప్రచారం మొత్తం ఇప్పుడు దారి మళ్లింది. తనను అయ్యర్ తిడితే.. ఆ తిట్లు యావత్ గుజరాత్ ను తిట్టినట్టుగా రంగు పులమడానికి ప్రధాని నరేంద్రమోడీ ఉబలాటపడుతున్నారు. ఈలోగా ఆయన సహాయకుల బృందంకూడా చాలా రంజైన పనిచేసింది. గత కొన్నేళ్లలో కాంగ్రెసుకు చెందిన ఏయే నాయకులు మోడీని ఏయే తిట్లతో దూషించారో.. అంతా జాబితా కట్టి ఆయనకు పంపించింది. మోడీ ఆ […]


 • కంగనాని బెదిరించిన సూపర్‌ స్టార్‌ ఎవరు.?

  సినీ పరిశ్రమలో బెదిరింపులు సహజం. వాటిని లైట్‌ తీసుకోకూడదు.. ఫైట్‌ చేయాల్సిందే. బెదిరింపుల విషయంలో ఇదివరకటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ధైర్యంగా ముందుకొచ్చి, ఆ బెదిరింపుల గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ మార్పు చాలా మంచిది..’ అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌.  బాలీవుడ్‌లో ఓ సూపర్‌ స్టార్‌ కంగనా రనౌత్‌ని బెదిరించాడట. ఎవరా సూపర్‌ స్టార్‌.? అన్న ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పడంలేదు. ‘చెప్పడానికి భయమేమీ లేదు. కానీ, చెప్పను. ఎందుకంటే, అది […]


 • రాజకీయ వారసుడు.. పెరిగిన దూకుడు…

  ఎట్టకేలకు కాంగ్రెస్‌ పగ్గాలను రాహుల్‌గాంధీ చేపట్టడానికి రంగం సిద్ధమవుతోంది. అయిదేళ్ల క్రితం జయపురలో జరిగిన సమావేశంలో ‘అధికారమంటే విషం సుమా’ అని చెబుతూనే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆయనకు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. భావోద్వేగం నడుమ ఆ బాధ్యతలు చేపట్టిన యువనేత ఇప్పుడా విష పాత్రను తీసుకునేందుకు సిద్ధపడాల్సి రావడం విశేషం..! ఇంతకాలం తల్లి నిర్వర్తించిన బాధ్యతల్ని వచ్చేవారం తనయుడు చేపట్టబోతున్నారు. పెద్ద బాధ్యతల్ని తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో రాహుల్‌ను గతంలో పప్పూ అంటూ విమర్శకులు ఎద్దేవా […]


 • తమిళనాట భారీ వర్షాలు

  తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన గంటల్లోనే రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలతో పాటు చెన్నై నగరంలో వర్షాలు మొదలయ్యాయి. దీనికి ‘ఓఖి’ తుపాను తోడవటంతో కన్యాకుమారి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. సుమారు 500 చెట్లు రోడ్లకు అడ్డంగా పడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పెద్దసంఖ్యలో విద్యుత్తు స్తంభాలు ఒరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపేశారు. తుపాను కారణంగా కన్యాకుమారితో పాటు పలుప్రాంతాల్లో మొత్తం అయిదుగురు […]