Articles Posted in the " Telangana " Category


 • జూనియర్ ఐపీఎస్‌తో లవ్ మ్యారేజ్

  వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి ఢిల్లీకి చెందిన 2011 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 18న వీరి పెళ్లి ఢిల్లీలో జరగనుందని సమాచారం. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని […]


 • తెలంగాణ గౌరవానికి ప్రతీక

  కనులపండువగా తెలుగు మహాసభల నిర్వహణ అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరికీ చక్కటి ఆతిథ్యమివ్వాలి భాష, సాహిత్యాలకు ప్రాధాన్యం జ్ఞాన్‌పీఠ్‌ పురస్కార గ్రహీతలకు సన్మానం ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తెలంగాణ గౌరవానికి ప్రతీక అని, కన్నులపండువగా కార్యక్రమాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇదో బృహత్కార్యమని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ప్రముఖులు హాజరవుతున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు […]


 • ప్రపంచ తెలుగు మహాసభలు

  తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా నిలిచిన భాగ్యనగరం నేటితరానికి నాటి సుప్రసిద్ద కవులు, రచయితలను స్పురణకు తేనుంది. రాజధాని నలువైపులా ఏర్పాటు చేసే 62 స్వాగత తోరణాలకు ప్రముఖ కవులు, రచయితల పేర్లను తెలంగాణ సర్కారు నిర్ణయించింది. స్వాగత ద్వారాన్ని చూసినంతనే చక్రవర్తి హాలుడు మొదలుకొని గూడ అంజయ్య వరకు ఒక్కసారిగా మదిలో మెదలనున్నారు. హాలుడు, ఎంప మహాకవి, మల్లియ రేచన, విద్యానాథుడు, ప్రతాపరుద్రుడు, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, గోన […]


 • కేంద్రం భరోసా

  15 రోజులకోసారి పోలవరానికి వస్తానన్న గడ్కరీ పని ఆపొద్దని ప్రస్తుత గుత్తేదారులకు ఆదేశం కొత్త టెండర్లపై సీఎంతో మాట్లాడి నిర్ణయం గుత్తేదారుకు ఆర్థిక వెసులుబాటుపై త్రిసభ్య కమిటీ తక్షణ నివేదిక 22న కేంద్ర మంత్రి రాక పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 కల్లా నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను వచ్చి స్వయంగా పనుల ప్రగతిని పరిశీలిస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ […]


 • ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం

  కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షసులు ముక్కు పచ్చలారని ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమర్చారు. పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. తన పుట్టిన రోజు వేడుకలకు స్నేహితులను ఆహ్వానించిన చిన్నారి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉండటం ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…  రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రాజు-ప్రవళిక దంపతులు ఏకైక కుమార్తె ఈర్ల రేష్మ(7) […]


 • అపోలోలో 100 రోబోటిక్ సర్జరీలు

  మహిళల్లో ఏర్పడే గర్భాశయ కణితులను తొలిగించడానికి నిర్వహించే రోబోటిక్ మయోమెక్టమైస్ సర్జరీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రుమా సిన్హా తెలిపారు. అపోలో దవాఖాన ఆధ్వర్యంలో 100 రోబోటిక్ సర్జరీలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపోలో జాయింట్ ఎండీ సంగీతారెడ్డితో కలిసి డాక్టర్ రుమా సిన్హా మాట్లాడారు. యుక్త వయస్సులో ఉన్న మహిళల గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారన్నారు. వీటివల్ల అధిక రక్తస్రావం, […]


 • బ్లూటూత్, హెడ్‌ఫోన్స్ ఆన్‌లో ఉంటే కేసే

  సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిసినా వాహనదారులు మారడం లేదు. డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలకు కారణం అవుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నా పట్టించుకోవడం లేదు. మీ ఒక్కరినే కాదు వెనుకాల వస్తున్న వారినీ ప్రమాదంలో నెడుతున్నారని మొత్తుకుంటున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిసినా.. కేసులు రాస్తున్నా నేరాలు తగ్గకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను […]


 • పక్షి విసర్జనాలతో రోగాలు

   నగరంలోని పావురానికి ఎక్కడలేని బద్దకం వచ్చింది. చక్కగా ఎగురుతూ, చెట్లెంబడి వెళ్తూ తిండిగింజలు తెచ్చుకొని కడుపు నింపుకొనేంత ఓపిక లేకుండా పోయింది. పావురాలు కనిపించినప్పుడు సిటీ కల్చర్ పేరుతోనో.. లేక సరదాగనో మనుషులు తిండి గింజలు వేసే దానగుణం.. పావురాల జీవన విధానాన్ని ఛిద్రం చేస్తున్నది. పురివిప్పాల్సిన రెక్కలు బరువెక్కి కదులటమే మానేశాయి. ఆహారం కోసం అన్వేషణ చేయాల్సిన అవసరం లేకుండానే కండ్లముందు వచ్చి పడుతుండటంతో ఆకాశంలో విహరించాల్సిన విహంగం నేలకు కరుచుకునిపోతున్నది. చెట్లపై ఆవాసముండాల్సిన పక్షి.. […]


 • కేంద్రం నుంచి పట్టుబట్టి సాధించుకున్న మూడు ఎక్స్‌ప్రెస్ హైవే

  కేంద్రం నుంచి పట్టుబట్టి సాధించుకున్న మూడు ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 1700 కిలోమీటర్ల నిడివిగల ప్రతిపాదిత హైదరాబాద్-అమరావతి, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలకు సంబంధించి డీపీఆర్లు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మూడు ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం జరిగితే సరిహద్దు రాష్ర్టాలతో రవాణా సంబంధాలు మెరుగుపడటంతోపాటు, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేకచొరవతో మూడు ఎక్స్‌ప్రెస్ హైవేలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వాటి నిర్మా ణం త్వరగా […]