Articles Posted in the " AP News " Category

 • నాది ఉడుంపట్టు

  పోలవరం పూర్తి చేసే సలహాలే వింటా అడ్డుకోవాలనుకుంటే లెక్కే చేయను గడ్కరీ సహకరిస్తామన్నారు.. రమ్మంటే దిల్లీ వెళ్తా.. గుత్తేదారుల కన్సార్టియం ఏర్పడుతోంది.. ‘పోలవరంపై ఉడుంపట్టు నాది. వదిలిపెట్టను. ప్రాజెక్టును పూర్తి చేసి తీరతా..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు. ‘రూపాయి అవినీతి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తా. ఎవరైనా దీని నిర్మాణం పూర్తి చేసేలా సలహాలు ఇస్తే వింటా. అడ్డుకుందామని చూస్తే లెక్కే చేయను’ అని కుండబద్దలు కొట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో సోమవారం ఆయన […]


 • పవన్.. మీ మాటల్తో.. మీ ఫ్యాన్స్ కు సిగ్గుచేటు!

  పవన్ కల్యాణ్ కు క్లారిటీ లేదు’ అనే వాక్యం అంటే గనుక.. ఆ వాక్యం రాసిన వాడిని- ఆయన ఫ్యాన్స్ అత్యంత నీచమైన బండ బూతులు తిడతారు. పరవాలేదు.. ఆవేశంలో ఎవరైనా తిడతార్లే.. అని సర్దుకోవచ్చు! అంతే తప్ప… రోజుకోరకమైన ఉదాహరణలు ఇస్తూ ఉంటే… పవన్ కల్యాణ్ గురించి ఆ మాటలు అనకుండా ఎలా ఉండగలం? ఇంకా కావలిస్తే.. తిట్టేసిన తర్వాత అయినా.. మీరు కూడా కాస్త ఈ కోణంలో ఆలోచించండి బాస్.. అంటూ ఫ్యాన్స్ కు  […]


 • పవన్‌ పిలుస్తున్నాడు.. వెళ్ళమ్మా అఖిలప్రియా.!

  దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్నట్టు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌, కృష్ణా నదిలో బోటు ప్రమాదం కారణంగా మృతిచెందినవారి కుటుంబాల్ని తాపీగా ఇప్పుడు పరామర్శించాడు. ‘ఆ సమయంలో విదేశాల్లో వుండబట్టి రాలేకపోయాను..’ అంటూ బాధిత కుటుంబాల్ని ఉద్దేశించి పవన్‌కళ్యాణ్‌ ‘వివరణ’ ఇచ్చుకున్నాడండోయ్‌.!  ‘ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు తగదు. రాజకీయాలు చేయడానికి నేను రాలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఆ బాధ్యత ప్రభుత్వాల మీదే వుంది..’ అంటూ పరమ రొటీన్‌ స్పీచ్‌ ఇచ్చాడు పవన్‌కళ్యాణ్‌. […]


 • గతం చెప్పుకుంటే బలం పెరుగుతుందా

  గడిచిపోయిన కాలం తిరిగిరాదు కాబట్టి గతాన్ని తలచుకొని సమయం వృథా చేసుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది కనుక దాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచించాలంటారు. ఇలాంటి ప్రవచనాలు సామాన్య జనాలకు పనికొస్తాయేమోగాని, రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండదు. వారికి భవిష్యత్తు ఎంత ముఖ్యమో గతమూ అంతే ప్రధానం. ఆంధ్రాలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి అక్కడ భవిష్యత్తు ఎంత ముఖ్యమో, తెలంగాణలో గతమూ అంతే ముఖ్యం. అదేంటి? ఆ రాష్ట్రంలో భవిష్యత్తు అక్కర్లేదా? అనే సందేహం […]


 • ఆ ప్రశ్న అంతర్మథనంలో పడేసింది: పవన్‌

  తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో మూడు విడతలుగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు. తొలి విడత పర్యటనలో సమస్యల పరిశీలన, అధ్యయనం, వాటిని అవగాహన చేసుకోనున్నారు. రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో మూడో విడత పర్యటన […]


 • అపోలోలో 100 రోబోటిక్ సర్జరీలు

  మహిళల్లో ఏర్పడే గర్భాశయ కణితులను తొలిగించడానికి నిర్వహించే రోబోటిక్ మయోమెక్టమైస్ సర్జరీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రుమా సిన్హా తెలిపారు. అపోలో దవాఖాన ఆధ్వర్యంలో 100 రోబోటిక్ సర్జరీలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపోలో జాయింట్ ఎండీ సంగీతారెడ్డితో కలిసి డాక్టర్ రుమా సిన్హా మాట్లాడారు. యుక్త వయస్సులో ఉన్న మహిళల గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారన్నారు. వీటివల్ల అధిక రక్తస్రావం, […]


 • కేంద్రం నుంచి పట్టుబట్టి సాధించుకున్న మూడు ఎక్స్‌ప్రెస్ హైవే

  కేంద్రం నుంచి పట్టుబట్టి సాధించుకున్న మూడు ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 1700 కిలోమీటర్ల నిడివిగల ప్రతిపాదిత హైదరాబాద్-అమరావతి, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలకు సంబంధించి డీపీఆర్లు తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మూడు ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం జరిగితే సరిహద్దు రాష్ర్టాలతో రవాణా సంబంధాలు మెరుగుపడటంతోపాటు, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేకచొరవతో మూడు ఎక్స్‌ప్రెస్ హైవేలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వాటి నిర్మా ణం త్వరగా […]


 • ఆగిపోతే కట్టలేం

  పోలవరం స్పిల్‌వే పనుల టెండర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో తీవ్రంగా స్పందించారు. పోలవరం పనులు ఎంతో వేగంగా జరుగుతున్న ఈ దశలో కేంద్రం నుంచి వచ్చిన లేఖ లేనిపోని గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఈ దశలో ప్రాజెక్టు ఆగిపోతే కట్టడం కష్టమని శాసనసభలో పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లోనూ ఇదే విషయమై విలేకరులతో మాట్లాడుతూ ఇంకొంత తీవ్రంగా స్పందించారు. పిలిచిన టెండర్లను కేంద్రం నిలిపేయమంటోందని, ఇలా ఆపమంటే వారికే […]


 • సిమెంటు రోడ్డుపై పరుగులు

  తెలంగాణలో రెండు మార్గాల్లో ప్రయోగం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా దీర్ఘకాలిక మన్నిక కోసమే.. తెలంగాణలో సిమెంట్‌ మార్గాల దిశగా అడుగులు పడ్డాయి. దీర్ఘకాలిక మన్నిక కోసం తొలిసారిగా రాష్ట్రంలోని రెండు మార్గాలను సిమెంటుతో నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రద్దీగా ఉండే మార్గాలను తొలిదశలో ఎంచుకున్నారు. తారుతో పోలిస్తే సిమెంటు రోడ్ల నిర్మాణ వ్యయం ఒకింత ఎక్కువైనా రహదారి మన్నిక గణనీయంగా ఉండటంతో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 2019 చివరి నాటికి ఈ రెండు మార్గాలు […]


 • జగన్ నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే!

  బనగానపల్లె నియోజకవర్గానికి చేరుకున్న పాదయాత్ర ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు ఉదయం దొర్నిపాడు నుంచా పాదయాత్ర ప్రారంభం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈ రోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం దొర్నిపాడు నుంచి ప్రారంభమైంది. అల్పాహారం తీసుకున్న తర్వాత ఉదయం 8 గంటలకు జగన్ తన పాదయాత్రను కొనసాగించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పాదయాత్ర కొలవకుంట్ల మండలం కంపమల్ల మెట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ నేతలు, […]