చీర కట్టుకుని ఆఫీస్‌కు వెళితే

వెన్నునొప్పి

రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన తాజా పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్‌ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని ఈ కొత్త పరిశోధన. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మెసోబ్లాస్ట్‌ అనే ఓ ఫార్మా  కంపెనీ ఉంది.aishwarya-rainpp

ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు 100 మందికి మూలకణాలు అందించింది. వెన్నెముకలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీల్లో ద్రవం పూర్తిగా ఇంకిపోయినప్పుడు చిన్నపాటి కదలికలకూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వారికి ఇతరుల ఎముక మజ్జలోంచి సేకరించిన మూలకణాలను ఎక్కించినప్పుడు వారిలో నొప్పి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిసింది. కొంతమందిలో దాదాపు రెండేళ్ల పాటు నొప్పి లేకపోగా.. కొంతమందికి సమస్య మూడేళ్ల తర్వాత గానీ తిరిగిరాలేదు. తాము పరిశోధనలు చేసిన వందమందిని ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసినప్పుడు వెన్నెముకలోని సమస్యలు చాలా వరకూ తగ్గిపోయినట్లు తెలిసిందని మెసోబ్లాస్ట్‌ సీఈవో సిలివూ ఇటెస్కూ తెలిపారు.

అతి ఏదైనా అనర్థమే అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు పరిశోధకులు. ప్రాణాధారంగా భావించే నీరే కొన్నిసార్లు ప్రాణాలను తీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరం అవసరానికి మించి నీరు తాగితే వాంతులు, కళ్ళు తిరగడం వంటివి సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిమీద ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు.

అతిగా నీరు తాగితే కోమాలోకి వెళ్లే ప్రమాదం

కొంతమందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు చేత అవసరం లేకున్నా నీరు తాగించారు. మరొక గ్రూపు చేత అవసరం ఉన్నంత మేరకే నీరు తాగించారు. అనంతరం రెండు గ్రూపుల వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు. అవసరానికి మించి నీరు తాగిన వారిలో వాంతులు, వికారం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. రెండో గ్రూపులో అలాంటివి కనిపించలేదు. మొదటి గ్రూపు వారిలో కనిపించిన లక్షణాలను ఏ మాత్రం ఆలస్యం చేసినా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

నీటిలో జననం… పురిటి నొప్పులు దూరం

సాధారణంగా గర్భిణులు డెలివరీ డేట్‌ దగ్గరకొస్తోందంటే సిజేరియన్‌ చేయించుకోవాల్సి ఉంటుందనీ, లేదా పురిటి నొప్పులు భరించాల్సి ఉంటుందని ఎంతో ఆందోళన చెందుతుంటారు. అయితే నీటి జననాలు (వాటర్‌ బర్త్స్‌)ను ఎంచుకుంటే నొప్పులు పెద్దగా ఉండవనీ, ప్రశాంతంగా కాన్పు అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మన దేశంలో చాలా మందికి ఇంకా అవగాహన కూడా లేని ఈ విధానాన్ని పాశ్యాత్య దేశాల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.

నీటి జననాల పద్ధతిలో గర్భిణిని ఒక పెద్ద నీటితొట్టెలో కూర్చోబెట్టి ప్రసవం అయ్యేలా చూస్తారు. అయితే సిజేరియన్‌ కచ్చితంగా అవసరమైన వారు, ఇంతకుముందు సిజేరియన్‌ చేయించుకున్నవారు, కవల పిల్లలు పుట్టేవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భందాల్చి 37 వారాలు నిండకముందే నొప్పులు వచ్చిన వారికి ఈ విధానం శ్రేయస్కరం కాదు.

భారతదేశంలోనే కాక దేశ, విదేశాలలో కూడా భారత సాంప్రదాయాల్ని పాటించే ఎందరో స్త్రీలు భారతీయ స్త్రీకి చీరే అందమంటారు. చీరకట్టుకు మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఎన్ని రకాల మోడ్రన్‌ డ్రెస్సులున్నా చీర అందం చీరదే. విదేశీ మహిళలు కూడా చీర కట్టుకోవడాన్ని చాలా ఇష్టంగా భావిస్తుంటారు. అయితే తాజాగా ‘చీరలోని చెడ్డదనం తెలుసుకో’ అంటూ ఓ జాతీయ న్యూస్ ఛానెల్ పేర్కొంది. చీర కట్టుకుంటే సవాలక్ష ఇబ్బందులు వస్తాయంటూ ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. అయితే  చీర వీడియోను చూసి నెటిజన్లు మాత్రం భగ్గుమంటున్నారు. మొన్నటిదాకా బాణాసంచాపై పడ్డారు, ఇప్పుడు మీ కళ్లు చీరలపై కూడా పడ్డాయా అని నిప్పులు చెరిగారు.

చీర కట్టుకుని ఆఫీస్‌కు వెళితే ఇబ్బందా?

చీర కట్టుకుంటే చాలా ఇబ్బందట. చీర ధరించి ఆఫీసుకు వెళ్తే నరకమేనంటూ… ఒక ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఒక మహిళ చీర కట్టుకొని ఆఫీసుకు వస్తే ఎన్ని రకాల అవస్థలు ఎదురవుతాయన్నది ఆ వీడియో సారాంశం. అయితే ఆ కంటెంటే ఇప్పుడు వివాదానికి కారణమైంది. మహిళలు చీర కట్టుకొని ఆఫీసుకు వెళ్లే సరిగా నడవలేరట. అందరూ పెళ్లయిందా అని అడుగుతారట. పైగా ఆంటీ అని పిలుస్తారట. పురుష ఉద్యోగులైతే గుచ్చి గుచ్చి చూస్తారంటూ ఆ వీడియోలో ఇష్టం వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా చీర కట్టుకుంటే టాయ్‌లెట్‌కు వెళ్లడం కూడా కష్టమంటూ తెగ ఇదైపోయారు.

 జనాల నుంచి సానుకూల స్పందన వస్తుందని వీడియో రూపొందించినవాళ్లు ఆశిస్తే, తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సేషనలిజం కోసం ఇలాంటి చీప్ ట్రిక్‌లు ప్లే చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియో చీర కట్టుకునే ప్రతి మహిళ మనోభావాన్ని దెబ్బతీసిందని కొందరు విమర్శిస్తే, ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇలాంటి వాంతులొచ్చే వీడియోలకు దిగజారిపోయిందా అని మరికొందరు దుయ్యబట్టారు. ఇంకొందరు నెటిజన్లు తిట్టిపోయడంతోనే సరిపెట్టకుండా  చీర విశిష్టత గురించి ఫోటోలు పెట్టి క్లాసులు పీకారు.

ఝాన్సీ లక్ష్మీబాయి చీర కట్టి మరీ యుద్ధరంగంలోనే చెలరేగిపోయింది, అంతకంటే కష్టమా..? అని ఒకరు ప్రశ్నిస్తే, చీర‌ల్లో ఆఫీసుకి వెళ్లి  ఇస్రో సైంటిస్టులు మార్స్ మిష‌న్ పూర్తి చేశారు. టాలెంట్‌, ప‌నిత‌నం ముఖ్యం. చీర అంటే అందమైన తెలివి అని అభివర్ణించారు. ఇంకొందరు ఇది హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు. మొన్న దీపావళి టపాసులు, ఇవాళ చీర, ఇక రేపు అగరుబత్తీలను కూడా టార్గెట్ చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ  వీడియోను మెచ్చుకున్న వారి కంటే తిట్టిన వారే ఎక్కువ. అయితే ఛానెల్ నిర్వాహకులు మాత్రం నెటిజన్ల విమర్శలతో తలబొప్పికట్టి నోరు మెదపడం లేదు. 

Tags: Pregnant Delivery Date water births no pain water, coma, body, danger water coma danger human body back Pain injuction

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *