స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచి

కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగా వుండటమే కాకుండా తోస్తే కిందపడేట్లుగా వుంటారు. మావాడు ఎంత తిన్నా బలం లేకుండా వున్నాడని చాలామంది బెంగపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది. stemless-glassware-set-of-4-npp

 

* నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి తాగుతున్నట్లయితే బలం కలుగుతుంది.
 
* ప్రతిరోజూ నల్ల నువ్వులు తిని చల్లని నీరు తాగుతున్నట్లయితే బలం వస్తుంది.
 
* స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచి, చల్లార్చిన తర్వాత ఆ నీటిని తాగుతున్నట్లయితే ఏనుగు వంటి బలం వస్తుంది.
 
* గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి తాగుతుంటే బలం వస్తుంది.
 
* తాజా వెన్నను ఉదయం తింటూ వుంటే బాగా బలం కలుగుతుంది.
 
* మర్రిపండులోని గింజలను తింటున్నా శరీరానికి మంచి బలం చేకూరుతుంది. 
 
* బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లను తింటున్నా శరీరానికి మంచి బలం వస్తుంది.

 
tags;Energy Health Benefits Gold Water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *