హీరోయిన్ మెహ్రీన్ వెళ్లిపోయిందా? అనుకున్నాను… మంచిది: సాయి ధరమ్ తేజ్

హైదరాబాద్ లో ‘జవాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
హీరో మాట్లాడకముందే వెళ్లిపోయిన హీరోయిన్
సరదా వ్యాఖ్యలు చేసిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపుదిద్దుకున్న ‘జవాన్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న వేళ, సాయి ధరమ్ ఆసక్తికర ప్రసంగం చేశారు. ఒక్కొక్కరి గురించి ప్రస్తావిస్తూ వచ్చిన ఆయన, హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ వద్దకు వచ్చేసరికి ఆమె కనిపించలేదు. పక్కనే ఉన్న ఎవరో మెహ్రీన్ వెళ్లిపోయిందని చెప్పగానే… “మెహ్రీన్ లేదా? వెళ్లిపోయిందా? అనుకున్నాను… మంచిదేలెండి వెళ్లిపోతే” అని వ్యాఖ్యానించాడు. ఆమె సినిమాలో బాగా నటించిందని చెప్పాడు. కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు తనకు అభుభవం చాలకుంటే, విలన్ గా నటించిన ప్రసన్న చాలా సాయపడ్డాటని చెప్పకొచ్చాడు. సాయి మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ‘పవన్ పవన్’ అని నినాదాలు చేస్తుంటే, “అవును… డెఫినెట్లీ మా ఇంటికి ఆయనే జవాను. నాకు ధైర్యంగా ఉండటం నేర్పించి, నన్నో జవానుగా తయారు చేశారు. ఆ జవాన్ కు సెల్యూట్” అన్నాడు.