నటిపై దాడి, అత్యాచారం కేసులో=ఏకంగా ఎనిమిదో స్థానానికి తగ్గించారట

నటిపై దాడి, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు అయిన మలయాళ స్టార్ హీరో దిలీప్ కు ఒక్కో చిక్కుముడీ వీడుతున్నట్టుగా ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టై దాదాపు అరవై రోజుల పాటు జైల్లో గడిపిన ఈ స్టార్ హీరోకి కొన్నాళ్ల కిందట బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దిలీప్ ను అన్ని రోజుల పాటు జైల్లో పెట్టినప్పటికీ పోలీసులు సరైన సాక్ష్యాధారాలు ఏవీ సంపాదించలేదనే ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది. ఇన్నాళ్లూ ఈ కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న దిలీప్ పేరును ఇప్పుడు ఆ స్థానం నుంచి తప్పించారట.. ఏకంగా ఎనిమిదో స్థానానికి తగ్గించారట.

ఈ మేరకు కొత్త చార్జిషీట్ ను దాఖలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దిలీప్ జైల్లో ఉన్నంత సేపూ ఈ కేసు చాలా వాడీవేడీగా నిలిచింది. నటిపై దాడి విషయంలో పోలీసులకు ఫలానా ఆధారాలు దొరికాయి… అనే మాటలు పదే పదే వినిపించాయి. నటిపై ఆగ్రహంతో దిలీప్ ఆమెపై దాడి చేయించాడని.. దీనికి గానూ నటి డ్రైవర్ ను మాజీ డ్రైవర్ ను వాళ్ల సన్నిహితుడు ఒకడిని డబ్బు ఇచ్చి వాడుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

దిలీప్ జైల్లో ఉన్నంత సేపూ అలా ఈ కేసు విచారణ రసవత్తరంగా సాగింది. అయితే.. ఒక్కసారి దిలీప్ కు బెయిల్ రాగానే కథంతా మారిపోతూ వస్తోంది. ప్రధాన నిందితుడు కాస్తా ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. ఇంతకీ ఈ కేసులో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతోంది. దిలీప్ ను సుదీర్ఘ కాలం పాటు జైల్లో పెట్టగలిగిన పోలీసులు ఆధారాలు సంపాదించడంలో విఫలం అయ్యారని అనుకోవాలా?

ఫోన్ సంభాషణలే పెద్ద ఆధారాలు అని మొదట్లో వినిపించిన మాట ఇప్పుడు ఎందుకు తెరమరుగు అవుతోంది? ఇన్నాళ్లూ పోలీసులు వైపు నుంచి కోర్టులో వినిపించిన వాదనల మాటేంటి? దిలీప్ కు బెయిల్ వద్దు అని వాదిస్తూ అతడిని ప్రధాన నిందితుడిగా చూపుతూ.. రకరకాల సాక్ష్యాలను పోలీసులు ప్రస్తావించారు. ఆఖరికి దిలీప్ భార్య, నటి కావ్య మాధవన్ కు కూడా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని చెప్పారు.. ఆమెను కూడా విచారించారు.

అయితే ఇప్పుడు మాత్రం దిలీప్ పై కేసు తీవ్రతను బాగా తగ్గించేస్తున్న వైనం అగుపిస్తోంది. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కొట్టుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడో ఫిబ్రవరిలో నటిపై దాడి జరిగితే.. ఇప్పటికీ పోలీసులు ఏమీ తెమల్చలేకపోతున్నారు. మరి దీనికి తెర వెనుక కారణాలు ఏమిటి? అయినా సినీహీరోలపై ఇలాంటి కేసులు నిలబడేనా? వెనుకటికి బాలయ్య ఇంట కాల్పుల కేసు కూడా నీరుగారిపోయింది కదా. బహుశా దిలీప్ కూడా రేపో మాపో తొడగొట్టి మీసం మెలేయవచ్చు!rape-in-carnpp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *