అపోలోలో 100 రోబోటిక్ సర్జరీలు

apollonppమహిళల్లో ఏర్పడే గర్భాశయ కణితులను తొలిగించడానికి నిర్వహించే రోబోటిక్ మయోమెక్టమైస్ సర్జరీలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ రుమా సిన్హా తెలిపారు. అపోలో దవాఖాన ఆధ్వర్యంలో 100 రోబోటిక్ సర్జరీలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపోలో జాయింట్ ఎండీ సంగీతారెడ్డితో కలిసి డాక్టర్ రుమా సిన్హా మాట్లాడారు. యుక్త వయస్సులో ఉన్న మహిళల గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్ వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారన్నారు. వీటివల్ల అధిక రక్తస్రావం, రక్తహీనత, పొత్తి కడుపులో నొప్పి తదితర సమస్యలు ఉంటాయని, వీటిని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు దారితీయవచ్చన్నారు. ఈ ఫైబ్రాయిడ్స్‌ను తొలిగించేందుకు గతంలో సర్జరీ మాత్రమే మార్గం అనుకునే వారన్నారు. అపోలోలో ఐదేండ్లుగా రోబోటిక్ సర్జరీల ద్వారా మహిళల్లో ఫైబ్రాయిడ్స్‌ను తొలిగిస్తున్నామన్నారు. ఇటీవల 100వ రోబోటిక్ సర్జరీని నిర్వహించడం ద్వారా అరుదైన ఘనత సాధించినట్టు వెల్లడించారు. 

TAGS;Apollo Hospital , Hundred Robotek Surgeries , Md Sangeeta Reddy ,