ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం

కామంతో కళ్లు మూసుకుపోయిన రాక్షసులు ముక్కు పచ్చలారని ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హతమర్చారు. పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. తన పుట్టిన రోజు వేడుకలకు స్నేహితులను ఆహ్వానించిన చిన్నారి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉండటం ప్రతీ ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… nppg
రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రాజు-ప్రవళిక దంపతులు ఏకైక కుమార్తె ఈర్ల రేష్మ(7) గ్రామంలోని ప్రయివే ట్‌ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతుం ది. అయితే ఎమ్మార్పీఎస్‌ నాయకురాలు భారతక్క మృతికి సంతాప సూచకంగా గ్రామంలో ఆదివారం రాత్రి ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో డీజేలతో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సమయంలో అన్నం తింటున్న రేష్మ ర్యాలీని చూసేందుకు వెళ్లినట్లు తెలిపారు. అప్పుడే ఇం టికి చేరుకున్న తండ్రి రాజు రేష్మను తీసుకు వచ్చేందుకువెళ్లగా అదృశ్యమైందన్నారు. రాత్రం తా బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెదికినా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం స్థా నిక పోలీ్‌సస్టేషన్‌లో రేష్మను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసినట్లుగా ఫిర్యాదు చేసి గ్రామంలో వెదుకుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వరి పొలాల్లోని గడ్డిలో విగత జీవి గా రేష్మ కనిపించినట్లు చెప్పారు.
 
అత్యాచారం చేసి హతమార్చారు…
ర్యాలీ వద్దకు చేరుకున్న రేష్మపై కన్నేసిన కామంధులు రాత్రి ఎస్సీకాలనీ సమీపంలోని వరి పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు గా గ్రామస్థులు అనుమానిస్తున్నారు. బాలికపై అత్యంత క్రూరంగా అత్యాచారంచేసి హతమా ర్చి ఉంటారని చెబుతున్నారు. చిన్నారి ఒంటిపై గాట్లతో పాటు దుస్తులు చిరిగి రక్తపు మరకలతో విగత జీవిగా పడి ఉండటం చూసి ప్రతీ ఒక్కరు రోదిస్తున్నారు. భూపాలపల్లి డీఎస్పీ ఎం.కిరణ్‌కుమార్‌, చిట్యాల సీఐ జి.మోహన్‌, ఇన్‌చార్జి ఎస్సై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
 
పుట్టిన రోజుకు ముందు రోజే…
తెల్లవారితే పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన రేష్మ కానరాని లోకాలకు వెళ్లిందని తల్లిదండ్రులు రాజు-ప్రవళికల రోదనలు ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. పెళ్లయిన ఐదేళ్లకు కూతురు పుట్టగా కామాంధుల చేతిలో నలిగిపోవడం చూసి గుండెలు బాదుకుంటున్నారు. సోమవారం తన ఏడవ పుట్టిన రోజు వేడుకలకని ఆదివారం పరకాలకు వెళ్లి కొత్త దుస్తుల తో పాటు కేక్‌, చాక్లెట్లు తీసుకువచ్చారు. పుట్టి న రోజు వేడుకలకు రావాలని రేష్మ అమ్మమ్మ, బంధువులతో పాటు చుట్టు పక్కల వారికి స్వ యంగా వెళ్లి చెప్పిందంటూ తల్లిదండ్రులు రోదిస్తూ చెప్పారు. కాగా,రేష్మ మృతితో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
గోరికొత్తపల్లిని సందర్శించిన ఏఎస్పీ  అదుపులో ఇద్దరు అనుమానితులు
ఏడేళ్ల చిన్నారి రేష్మ అత్యాచారం, హత్యకు గురైన నేపథ్యంలో మండలంలోని గోరికొత్తపల్లిలో ఏఎస్పీ రాజమహేంద్రనాయక్‌ సోమవా రం రాత్రి పర్యటించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నుంచి వివరాలు సేకరించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్‌ ఏర్పా టు చేశారు. కాగా, గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకునిఏఎస్పీ రాజమహేంద్రనాయక్‌ ఆధ్వ ర్యంలో విచారిస్తున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *