కంగనాని బెదిరించిన సూపర్‌ స్టార్‌ ఎవరు.?

సినీ పరిశ్రమలో బెదిరింపులు సహజం. వాటిని లైట్‌ తీసుకోకూడదు.. ఫైట్‌ చేయాల్సిందే. బెదిరింపుల విషయంలో ఇదివరకటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ధైర్యంగా ముందుకొచ్చి, ఆ బెదిరింపుల గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ మార్పు చాలా మంచిది..’ అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌. kang-1npp

బాలీవుడ్‌లో ఓ సూపర్‌ స్టార్‌ కంగనా రనౌత్‌ని బెదిరించాడట. ఎవరా సూపర్‌ స్టార్‌.? అన్న ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం చెప్పడంలేదు. ‘చెప్పడానికి భయమేమీ లేదు. కానీ, చెప్పను. ఎందుకంటే, అది ఇప్పటి విషయం కాదు. ఇప్పుడు చెప్పినా, ఆ సూపర్‌ స్టార్‌ బుకాయించే ఛాన్స్‌ వుంది. చెప్పడం వల్ల ప్రయోజనం కూడా లేదు..’ అని కంగనా చెప్పుకొచ్చింది. 

‘పద్మావతి’ సినిమాకి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో కంగనా రనౌత్‌, ఈ తరహా బెదిరింపులపై స్పందించింది. ఎఫైర్స్‌ పేరుతో కొందరు, ఇతరత్రా వివాదాలతో ఇంకొందరు, సినీ పరిశ్రమ నుంచి తనను బయటకు పంపేందుకు చాలా కుట్రలు పన్నారనీ, వాటన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాననీ కంగనా రనౌత్‌ అంటోంది. 

నిజమే, కంగనా సినీ కెరీర్‌లో లెక్కలేనన్ని వివాదాలున్నాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అయితే, వాటిల్లో చాలావరకు కంగనా పబ్లిసిటీ స్టంట్స్‌ నేపథ్యంలో తెరపైకొచ్చినవే. ఇప్పుడంటే కంగనా స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. కాబట్టే, నీతులు చెబుతోందన్నది బాలీవుడ్‌లో చాలామంది మాట. హృతిక్‌ రోషన్‌ విషయంలో కంగనా చేస్తోన్న రాద్ధాంతం గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? బహుశా కంగనా చెబుతున్న ఆ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ కాదు కదా.!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *