పవన్.. మీ మాటల్తో.. మీ ఫ్యాన్స్ కు సిగ్గుచేటు!

పవన్ కల్యాణ్ కు క్లారిటీ లేదు’ అనే వాక్యం అంటే గనుక.. ఆ వాక్యం రాసిన వాడిని- ఆయన ఫ్యాన్స్ అత్యంత నీచమైన బండ బూతులు తిడతారు. పరవాలేదు.. ఆవేశంలో ఎవరైనా తిడతార్లే.. అని సర్దుకోవచ్చు! అంతే తప్ప… రోజుకోరకమైన ఉదాహరణలు ఇస్తూ ఉంటే… పవన్ కల్యాణ్ గురించి ఆ మాటలు అనకుండా ఎలా ఉండగలం? ఇంకా కావలిస్తే.. తిట్టేసిన తర్వాత అయినా.. మీరు కూడా కాస్త ఈ కోణంలో ఆలోచించండి బాస్.. అంటూ ఫ్యాన్స్ కు  కూడా రిక్వెస్టు చేసుకోగలం!ga_pawannpp

ఇప్పుడు విషయంలోకి వద్దాం..

పవన్ కల్యాణ్ తన ఆంధ్రా టూర్ లో భాగంగా.. ఇవాళ ఒంగోలులో ప్రసంగించారు. పెద్దగా కొత్త విషయాలు ఏం లేవుగానీ.. తనలోని సందిగ్ధతను మరో మారు బయటపెట్టారు.

తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ‘ఒక్కడినే బయల్దేరా అని, మార్పు ఎప్పుడైనా సరే ఒక్కడితోనే మొదలవుతుందని’ అన్నారు.

అదే ప్రసంగంలో ప్రత్యేకహోదా సంగతి కూడా వచ్చింది. ‘నేను ఒక్కడినే పోరాడితే ప్రత్యేక హోదా రాదు… అందరూ కలిస్తేనే సాధించుకోవచ్చు’ అని సెలవిచ్చారు.

… ఇంతకూ పవన్ ఏం చెప్పదలచుకున్నారు. ఏకంగా రాజకీయాలనే ప్రక్షాళన చేసేయాలనేంత బృహత్ కార్యాన్ని నెత్తికెత్తుకుంటే మాత్రం.. మార్పు తనొక్కడితోనే మొదలవుతుందని.. డంబాలు చెప్పుకుంటాడా… హోదా విషయంలో చంద్రబాబు వాదనకు కొమ్ము కాయడానికి తనొక్కడి వల్ల హోదా రాదంటూ కాడి పక్కన పారేస్తాడా? ఏంటీ వైరుధ్య ప్రకటనలు. ఇంతకూ పవన్ కల్యాణ్ ఎవరిని మోసం చేయదలచుకుంటున్నారు.

ఆయన ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలను తెలిసి చేస్తున్నారా? లేదా అమాయకంగా తెలియక చేస్తున్నారా? ప్రజల్ని ఆయన వెర్రివాళ్ల కింద జమకడుతున్నారా? తనేం మాట్లాడినా సరే.. జనం ‘సీఎం సీఎం’ అంటూ కేరింతలు కొడతారే తప్ప.. వారికి బుర్రల్లేవులే.. తను మాట్లాడిన విషయాలను లోతుగా పరిశీలించే వాళ్లెవరూ ఉండర్లే అని అనుకున్నారా ఏమో తెలియదు.

ఒక దశ దాటే కొద్దీ.. పవన్ కల్యాణ్ అభిమానులకు కూడా ఆయన ప్రసంగాల పట్ల ఏవగింపు  పుడుతోంది. ఇతరత్రా మోజులతో  ఆయన వెంటపడుతున్న వాళ్లు తప్ప… అంశాల వారీగా నిర్దిష్టమైన నాయకుడిగా ఆయనను చూడదలచుకుంటున్న వారు.. ఆయన పోకడల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో అందరూ కలసి వస్తే.. అంటున్న పవన్ కల్యాణ్ .. ఎవరు కలసి రావడం లేదో.. వేదిక మీదే ఎందుకు చెప్పలేరు? ఎవరు కలిసి రావాలి? ఆయన పోరాటంలోకి నిన్న గాక మొన్న వచ్చి.. అప్పుడే తూచ్ అనేస్తున్నాడు.

ఆయన తానుగా వెళ్లి రాష్ట్రం కోసం తన కంటె ముందునుంచి పోరాడుతున్న వారితో కలవాలి.. నేను కూడా మీతో కలిసి పోరాడుతా అని అడగాలి.. దానిని చిత్తశుద్ధి అంటారే తప్ప.. ఇలా చంద్రబాబునాయుడు గూటిలోని చిలకలాగా.. ఆయన మాట్లాడమన్నట్లుగా పదాలను వల్లె వేస్తూ ఉంటే.. పవన్ ఫ్యాన్స్ అందరికీ కూడా సిగ్గు చేటు అని ఆయన తెలుసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *