ఈ ఏడాది హీరోలుగా ఇద్దరు అమెరికన్‌ ఇండియన్లు

newsnppఅమెరికాలో ఇద్దరు ఇండియన్‌ అమెరికన్లు సమీర్‌ లఖానీ (పిట్స్‌బర్గ్‌), మోనా పటేల్‌ (టెక్సాస్‌) ప్రతిష్టాత్మక సిఎన్‌ఎన్‌ హీరోస్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పోటీలోని 10 మంది ఫైనలిస్టుల జాబితాకి ఎక్కారు. ఈ నెల 17న ఈ వార్షిక అవార్డును ప్రదానం చేస్తారు. సబ్బుతో అవసరం లేకుండా పారేసే వస్తువుల రిసైక్లింగ్‌తో శుభ్రం చేసే ప్రక్రియను లఖానీ కనుగొన్నారు. కంబోడియా అంతటా బార్లలో ప్రస్తుతం ఇది వాడకంలో ఉంది. గ్రామాలకు సరఫరా చేయడానికి దీనిని సిద్ధం చేస్తున్నారు. 2014లో కాలేజీ విద్యార్థిగా ఆ ప్రయోగాలను అతడు ప్రారంభించాడు. కంబోడియా బార్లలో సబ్బు చాలా ఖరీదు కావడంతో అతడి కొత్త ప్రక్రియ తక్షణమే ఆకట్టుకొంది. శరీర భాగాలను తొలగించవలసి వచ్చిన వారు తిరిగి తమ జీవితాలను సాఫీగా సాగించడానికి అవసరమైన పద్ధతులను మోనా పటేల్‌ కనుగొన్నారు. సాన్‌ ఆంటో నియో యాంపుటీల సంఘం ఆయన కృషికి అండగా నిలిచింది.

tags; Monal Patel, Samir Lakhani, CNN Hero of the Year, Indo Americans