ప్రపంచ తెలుగు మహాసభలు

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా నిలిచిన భాగ్యనగరం నేటితరానికి నాటి సుప్రసిద్ద కవులు, రచయితలను స్పురణకు తేనుంది. రాజధాని నలువైపులా ఏర్పాటు చేసే 62 స్వాగత తోరణాలకు ప్రముఖ కవులు, రచయితల పేర్లను తెలంగాణ సర్కారు నిర్ణయించింది. స్వాగత ద్వారాన్ని చూసినంతనే చక్రవర్తి హాలుడు మొదలుకొని గూడ అంజయ్య వరకు ఒక్కసారిగా మదిలో మెదలనున్నారు.newsnpp

హాలుడు, ఎంప మహాకవి, మల్లియ రేచన, విద్యానాథుడు, ప్రతాపరుద్రుడు, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, గోన బుద్దారెడ్డి, కుప్పాంజిక, గౌరన, మారన, మడికి, సింగన, కొరవి గోపరాజు, కామినేని మల్లారెడ్డి, సింహగిరి కృష్ణమాచార్యులు, సర్వజ్ఞసింగభూపాలుడు, చరిగొండ ధర్మన్న, ఏకామ్రనాథుడు, మరింగంటి సింగరాచార్యులు, అద్దంకి గంగాధర కవి, పొన్నగంటి తెలగన్న, సారంగు తమ్మయమ, సరుభి మాధవరాయులు, ఎలకూచి బాలసరస్వతి, భక్త రామదాసు, శేషప్పకవి, వరకవి సిద్దప్ప, రాకమచర్ల వేంకటదాసు, దున్నఈద్దాసు, గడ్డం రామదాసు, సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, రావిచెట్టు రంగారావు, కాళోజీ, ఒద్దిరాజు సోదరులు, బండారు అచ్చమాంబ, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావు, దాశరథి కృష్ణమాచార్య, నెల్లూరి కేశవ స్వామి, భాగ్యరెడ్డివర్మ, దాశరథి రంగాచార్య, సి.నారాయణరెడ్డి, బిరుదరాజు రామరాజు, పాకాల యశోదారెడ్డి, కవిత్రయం (నన్నయ, తిక్కన ఎర్రాప్రగడ), శ్రీనాథుడు, అల్లసాని పెద్దన, వేమన, తిరుపతి వేంకటకవులు, అన్నమాచార్య,  గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, గుర్రం జాషువా, గంగుల శాయిరెడ్డి, పల్లా యాదయ్య,  వానమామలై వరదాచార్యులు, అరిగె రామస్వామి, దైదవేములపల్లి దేవేందర్‌, అలిశెట్టి ప్రభాకర్‌, మల్కిభరాముడు, గూడ అంజయ్య పేర్లను తోరణాలకు పెట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *