Articles Posted by the Author:

 • ఏపీకి గుడ్ న్యూస్.. ప్రత్యేక ప్యాకేజీకి రేపే చట్టబద్ధత!

  ప్రత్యేక హోదా రాక ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి తీపి కబురు అందనుంది. ప్రత్యేక ప్యాకేజీకి రేపు(బుధవారం) చట్టబద్ధత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఒత్తిడితో కేంద్రమంత్రి సుజనా చౌదరి రెండు రోజులుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థికశాఖ అధికారులను కలసి కసరత్తు చేస్తున్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత విషయంలో లోపాలు లేకుండా చూడాలన్న చంద్రబాబు […]


 • ఇంకా నయం.. ఎవరెస్ట్‌పై ర్యాలీ చేసుకోమనలేదు..!

  పోలీసుల తీరుపై కోదండరాం వ్యంగ్యం రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిరుద్యోగుల నిరసన ర్యాలీని నిర్వహించుకోవాలన్న పోలీసుల ప్రతిపాదనపై టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఇంకా నయం.. ఎవరెస్ట్ శిఖరం మీద చేసుకోమన్నారు కాదు’’ అని ధ్వజమెత్తారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఫలితం ఉండబోదన్నారు. ర్యాలీని శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ర్యాలీ పూర్తయ్యే వరకు నిద్రపోబోమని తేల్చి చెప్పారు. జేఏసీ ఆవిర్భావం […]


 • కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు?

  ‘కమర్షియల్‌’ స్కాంపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌ ⇒ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా పెంచాలని ఆదేశం ⇒ సీఐడీ విచారణపై ఆరా..ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై విచారణ బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్‌ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ రాబడికి గండి కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ సంబంధిత విభాగ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కేవలం రూ.60 కోట్ల వరకే స్కాం జరిగినట్లు నివేదికిచ్చారని, కానీ సీఐడీ విచారణలో వందల కోట్లు […]


 • 197 కేసులు.. 125 అరెస్ట్‌లు

  నయీమ్‌ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేసి, 125 మందిని అరెస్ట్‌ చేశామని సిట్‌ చీఫ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 330 మందిని పీటీ వారెంట్‌పై విచారించామని, 107 మంది పోలీస్‌ కస్టడీలోనే ఉన్నారన్నారు. 878 సాక్షులను విచారించామ ని, 18 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు చెప్పారు. 14 మంది నయీమ్‌ అనుచరులపై పీడీ యాక్టులు మోపామని, వారిలో పాశం శ్రీను, సందెలా సుధాకర్, అబ్దుల్‌ నాసర్, బాచు నాగరాజు, పులి నాగరాజు, […]


 • దర్శకుడి బండారం బయటపెట్టిన కంగనా

  బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వెరీ డిఫరెంట్ . చాలా ఫ్రాంక్. ఎలాంటి విషయాన్ని అయినా ఓపెన్ గా చెప్పేస్తుంది. తాజగా దర్శకుడు కరణ్ జోహార్ పరువు తీసేసింది కనగాన. తన జీవితంలో విలన్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కరన్ జోహార్ అని, తన బయోపిక్ తీస్తే.. అందులో విలన్ పాత్ర కరన్ దేనని, ఆ పాత్రను అతడే పోషిస్తే మరింత బాగుంటుందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కంగనా. కారణo కొత్త టాలెంట్ పరిశ్రమలోకి రానివ్వడని, […]


 • నా తండ్రి అసమాన నాయకుడు, ధీశాలి, యోధుడు.. ఐ లవ్ యూ డాడ్: కేటీఆర్

  తన తండ్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కన్న అతి గొప్ప కుమారుడు తన తండ్రి అని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసమానమైన నాయకుడు, ధీశాలి, యోధుడు తన తండ్రి అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘హ్యాపీ బర్త్ డే డాడ్’ అని ట్వీట్ చేశారు. ఆయన కొడుకుగా పుట్టడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. దీనికితోడు, ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కేసీఆర్ ఫొటోను కేటీఆర్ అప్ లోడ్ చేశారు. […]


 • టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభం.. హాజరైన చంద్రబాబు, లోకేష్

  విజయవాడలో టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ప్రారంభమయింది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించి కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ కు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సంతృప్తికరంగా జీవించేలా పాలన కొనసాగించాలని […]


 • నేడు యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ .. బీజేపీకి దీటైన జవాబు?

  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి ప్రియాంకా గాంధీ కూడా దిగుతున్నారు. నేడు అమేధీలో జరగనున్న బహిరంగ సభలో సోదరుడు రాహుల్ గాంధీతో పాటు ఆమె వేదికను పంచుకోనున్నారు. తద్వారా ఆమె బీజేపీ విమర్శలకు సమాధానం చెప్పనున్నారు. నిన్న స్మృతీ ఇరానీ మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ ఇంతవరకు ప్రచారంలో పాల్గొనకపోవడానికి కారణం తనకు తెలుసన్నారు. అమేధీలో ఓటర్లకు ప్రియాంక, రాహుల్ చాలా హామీలిచ్చారని, ఇంతవరకు అవి నేర్చకపోవడంతో మొహం చెల్లక రాలేదని ఎద్దేవా చేశారు. ఆమె విమర్శలకు సమాధానంగా […]


 • భారతీయులను భయపెట్టిన ట్రంప్ ఎలా బుట్టలో పడేశాడో తెలుసా?

  ముస్లింలపై ట్రావెల్ బ్యాన్, హెచ్1బీ వీసాలపై ఆంక్షలు.. అంటూ భారతీయులను బెంబేలెత్తించిన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను వినియోగించుకునేందుకు భారతీయుులు పోటీ పడుతున్నారు. సగటున వారానికి ముగ్గురు చొప్పున భారతీయులు ఈబీ-5 వీసా ప్రోగ్రాంలో చేరిపోతున్నారు. ఇంతకీ ఈబీ-5 వీసా ప్రోగ్రాం అంటే ఏంటి? ఈబీ-5 వీసా ప్రోగ్రాం అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలనుకునే విదేశీయులు మిలియన్ డాలర్ల పెట్టుబడితో స్టార్టప్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రభుత్వం ఆమోద ముద్రవేస్తే… ఆ స్టార్టప్ లో […]


 • భారీ క్రేజ్ నడుమ విడుదలవుతున్న ‘ఘాజి’ !

  హీరో రానా నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘ఘాజి’ ఈరోజే భారీ పాజిటివ్ క్రేజ్ నడుమ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతోంది. ఆరంభంలో అంతగా ఆకట్టుకోకపోయినా మెల్లగా టీమ్ చేసిన ప్రమోషన్ల ద్వారా సినిమాలో ఏం చెప్పబోతున్నారో బయటకు తెలియడంతో అందరిలోనూ చిత్రం పట్ల ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి మెల్లగా పెరుగుతూ క్రేజ్ గా మారిపోయింది. దీంతో చిత్రంపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. పైగా […]