Articles Posted in the " AP News " Category

 • కోడి పందేలు జోరుగా …

     తణుకు పరిసర ప్రాంతాల్లో కాళ్లకు కత్తులు కట్టి కోళ్లను బరిలోకి వదిలారు. ముక్కనుమ రోజున తెల్లవారుజామునే పందెంరాయుళ్లు బరులకు చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒక్కో పందెంలో వేలకు వేలు చేతులు మారాయి. కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి మూడు రోజులు మాత్రమే కోడి పందేలు ఆడేవారు.


 • సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి: పవన్ కల్యాణ్

  సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ఈ సంక్రాంతి పండగ ఉద్దానం కిడ్నీ బాధితులకు సాంత్వన కలుగజేయాలని  కోరుకున్నారు. కరెన్సీ రద్దు వంటి గాయాల బారిన పడకుండా, రాజకీయ పెద్దల నుంచి సంక్రాంతి పండగ ప్రజలను కాపాడాలని పవన్ కోరుకున్నారు.


 • 2019లో పవన్ కల్యాణ్ కు ఆశాజనకంగా ఉండదనుకుంటున్నా: జేసీ దివాకర్ రెడ్డి

  2019లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఆశాజనకంగా ఉండదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో పారిశ్రామిక వేత్త పుట్ట గుంట సతీష్ నివాసానికి ఆయన వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు పవన్ టెంపర్ మెంట్, ఆయనకు ఉన్నశక్తి చాలదని, తాను అంతకంటే ఎక్కువ మాట్లాడటం మంచిది కాదని అన్నారు. సినిమా హీరోలకు ఓట్లేసి పరిస్థితి తగ్గిపోయిందన్నారు. ఎంతో గ్లామర్ ఉన్న ఎన్ టి […]


 • కోడి పందేలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు

   కోడి పందేలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించినా పండగ మూడు రోజులూ ఎలాగొలా బరిలో కోడిని దించేందుకు పట్టు బిగుస్తోంది. ఇందులో కోడి గెలుస్తుందా, ఆదేశాలు అమలవుతాయా అన్న అంశాన్ని పక్కన పెడితే పండగల్లో పందేలకు కోడిపుంజులనే ఎందుకు ఎంచుకుంటున్నారు..?   జీవక్రియలో వేగం పెరుగుతుంది. కండరాలన్నీ మరింత శక్తిమంతంగా రూపుదిద్దుకుంటాయి. రెక్కల్లో ఉండే ఉడ్డయిక కండరాలు సైతం బలోపేతంగా మారతాయి. మెడను దువ్వడం ద్వారా ఎడ్రినలిన్‌ హార్మోన్ల ప్రభావంతో నాడులన్నీ ఉత్తేజితమవుతాయి. అది పౌరుషాన్ని పెంచడంతోపాటు […]


 • బూట్లు నాకే వాణ్నయితే మంత్రిగానే ఉండేవాణ్ని

  ఎంపీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు వేదికపై విస్తుపోయిన రాష్ట్ర మంత్రులు బూట్లు నాకే వాడినే అయితే ఎప్పుడూ మంత్రిగానే ఉండేవాడినని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం జన్మభూమి సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపైనున్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇదే ఊపులో జేసీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై తీవ్ర […]


 • కొత్త విధానాలు.. కేరాఫ్‌ అమరావతి

  దేశంలో ఏ కొత్త విధానానికి నాంది పలికినా దానికి కేరాఫ్‌ అడ్ర్‌సగా అమరావతి, విజయవాడ నిలుస్తున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం డిజిధన్‌ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో కేంద్ర మంత్రి వెంకయ్యతో కలిసి సీఎం పాల్గొన్నారు. సుమారు 80కుపైగా బ్యాంకులు, మొబైల్‌ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. పెద్ద నోట్ల రద్దును దేశంలో ప్రోత్సహించిన మొట్టమొదటి సీఎంని తానేనని చంద్రబాబు అన్నారు. నవంబర్‌ 8 నాటికి రాష్ట్రంలో […]


 • సహకారం అందిస్తాం.. త్వరలో రాష్ట్రానికి శ్రీలంక బృందం

  నవ్యాంధ్ర రాజధానిపై ఆసక్తి ఎజెండాలో పర్యాటకం, ఆతిథ్యం, గృహ నిర్మాణం పశ్చిమ శ్రీలంక అభివృద్ధిపై కీలక భేటీ చంద్రబాబుకు శ్రీలంక ప్రధాని విందు అధ్యక్షుడు సిరిసేనతో కలసి జాతీయ సదస్సులో ప్రసంగం తెలుగువారితోనూ సమావేశం రాజధాని అమరావతి స్మార్ట్‌ సిటీ అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి శ్రీలంక ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ముఖ్యంగా పర్యాటక-ఆతిథ్య, గృహ నిర్మాణ రంగాల్లో భాగస్వామ్యానికి ఆ దేశ మెగాపొలిస్-పశ్చిమ ప్రావిన్స్‌ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. పలు రంగాల్లో పరస్పర […]


 • పవన్‌కల్యాణ్‌కు సాయపడలేదు: ఎలమంచిలి ఎమ్మెల్యే రమేష్‌ బాబు

  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు శ్రీకాకుళం పర్యటనలో తాను సహకరించలేదని, ఏ విధంగానైనా తాను సాయపడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రకటించారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల పవన్‌కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయనకు విశాఖ నుంచి తానే వాహనం (ఎండీవర్‌ కారు) ఏర్పాటు చేసినట్టు పార్టీకి ఫిర్యాదు చేశారన్నారు. ఎండీవర్‌ కారు తమ కుటుంబంలో ఎవ రికీ లేదని స్పష్టంచేశారు. పంచకర్ల […]


 • వైఎస్‌ ప్రాజెక్టులకు గేట్లెత్తుతున్నావ్‌

  ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పుడు చంద్రబాబు వచ్చి గేట్లు ఎత్తుతున్నాడు. వైఎస్సార్‌కు క్రెడిట్‌ ఇవ్వాల్సిన ప్రాజెక్టులకు లస్కర్‌ మాదిరిగా గేట్లు ఎత్తి, తానే ఆ ప్రాజెక్టుల కోసం కలలు కన్నానని చెబుతున్నారు. అదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ అనే దుర్బుద్ధితో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం డ్యాంలో నీరు ఉన్నప్పటికీ నీరు ఇవ్వడంలేదని, […]