Articles Posted in the " Business " Category

 • పెళ్లి ఖర్చు రూ. 5 లక్షలు దాటిందా?.. పదిశాతం పన్ను కట్టాల్సిందే!

  వివాహ సమయాల్లో పెరిగిపోతున్న దుబారా ఖర్చులను తగ్గించేందుకు సరికొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది. ఇక నుంచి పెళ్లి ఖర్చు రూ. 5 లక్షలు దాటితే అందులో పదిశాతం ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది. ఎంపీ పప్పు యాదవ్ సతీమణి, కాంగ్రెస్ ఎంపీ రంజిత రంజన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాహ బిల్లు-2016లో ఈ మేరకు ప్రతిపాదన తీసుకొచ్చారు. వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడంతోపాటు, వృథా ఖర్చును తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రవేటు బిల్లుగా పరిగణించి వచ్చే లోక్‌సభ […]


 • మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

  వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,790, విజయవాడలో రూ.29,800, ప్రొద్దుటూరులో రూ.29,800, చెన్నైలో రూ.29,780, ముంబైలో రూ.29,475గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,190, విజయవాడలో రూ.27,650, ప్రొద్దుటూరులో రూ.27,610, చెన్నైలో రూ.28,290, ముంబైలో రూ.29,325గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.42,900, విజయవాడలో రూ.42,800, ప్రొద్దుటూరులో రూ.42,800, చెన్నైలో రూ.42,730, […]


 • ఎక్కడా ఆగకుండా 10 టైమ్ జోన్ లను దాటొచ్చి రికార్డు సృష్టించిన ఖతార్ విమానం

  ప్రపంచంలో అత్యధిక దూరాన్ని ఆగకుండా ప్రయాణించిన రికార్డును ఖతార్ ఎయిర్ వేస్ సొంతం చేసుకుంది. దోహా నుంచి ఆక్లాండ్ కు బయలుదేరిన ‘క్యూఆర్ 920’ సర్వీస్ నంబర్ విమానం మొత్తం 14,535 కిలోమీటర్లను ప్రయాణించి ఈ ఉదయం షెడ్యూల్ సమయానికి 5 నిమిషాల ముందుగా 7:25కు ఆక్లాండ్ చేరుకుంది. మొత్తం 16 గంటలా 23 నిమిషాల పాటు విమానం ప్రయాణించిందని, మార్గ మధ్యంలో 10 టైమ్ జోన్ లను దాటిందని ఖతార్ ఎయిర్ వేస్ తన ట్విట్టర్ […]


 • నేడు జియోమీ రెడ్ మీ నోట్ 4 ఫ్లాష్ సేల్… ధర రూ. 9,999

  రెండు వారాల క్రితం భారత మార్కెట్లోకి విడుదలై నిమిషాల వ్యవధిలో అందుబాటులో ఉంచిన స్మార్ట్ ఫోన్లన్నీ విక్రయమై సంచలనం కలిగించిన జియోమీ రెడ్ మీ నోట్ 4 నేడు మరో విడత అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు ‘మీ డాట్ కామ్’లో ప్రారంభమవువుందని సంస్థ పేర్కొంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999గా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ […]


 • పెరగనున్న సెల్ ఫోన్ ధరలు?

  కొత్తగా మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే బడ్జెట్ మీకు కాస్త షాకిచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు పెడుతున్న ధరకంటే 1 లేదా 2 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2017-18 లో భారత్‌ లో తయారయ్యే మొబైల్‌ ఫోన్లపై స్పెషల్‌ అడిషనల్‌ డ్యూటీ (ఎస్‌ఏడీ) ని అదనంగా విధించనున్నారు. మొబైల్ లో ప్రధానమైన పాపులేటెడ్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ […]


 • ఆదాయపన్ను రేట్లు ఇలా..

  పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలలో భాగంగా వేతన జీవులకు ఆదాయపన్ను విషయంలో మంచి ఊరట లభించింది. ఆదాయపన్ను రేటును అరుణ్‌ జైట్లీ స్వల్పంగా సవరించారు. 2.5 లక్షల వరకు ఉన్న పరిమితిని యథాతథంగానే ఉంచినా, 2.5 లక్షల నుంచి 5లక్షల వరకు 5% పన్ను మాత్రమే విధిస్తామన్నారు. ఇంతకుముందు ఇది 10 శాతంగా ఉండేది. అయితే, ఆదాయం 5 లక్షలు దాటిన తర్వాతి పన్ను వివరాలను మాత్రం ప్రకటించలేదు. దాంతో అధికాదాయ వర్గాలకు ఆదాయపన్ను యథాతథంగా […]


 • ఇమిగ్రేషన్‌పై కొరడా

  ఇప్పటికే ఒబామాకేర్‌ను రద్దుచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. వలసవాదులపై కఠినంగా వ్యవహరించటం, మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టడంపై ఈ వారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వలస విధానంలో ముస్లిం దేశాల నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయటంపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇరాక్, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్‌ వంటి దేశాలనుంచి వలసలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయటమా లేక.. శాశ్వతంగా నిరోధించటమా అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. Trump, thwart, migrants,


 • వాట్సాప్ కు పోటీగా ఓ సూప‌ర్ చాటింగ్ యాప్..!

  ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ల‌లో చాటింగ్ యాప్ అంటే వాట్సప్ మాత్రమే. గూగుల్ ప్లే స్టోర్ లో ఎన్నో యాప్స్ ఉన్నప్ప‌టికీ వాట్స‌ప్ కు ఉన్న క్రేజే వేరు. అందుకే ఎన్ని చాటింగ్ యాప్స్ వ‌చ్చినా వాట్స‌ప్ కు పోటీనివ్వ‌లేక‌పోయాయి. అయితే గూగుల్ తీసుకొస్తున్న ఓ సరికొత్త యాప్ మాత్రం వాట్స‌ప్ కు బ‌ల‌మైన పోటీనిస్తుంద‌ని టెక్ నిపుణులు చెపుతున్నారు. గూగుల్ రూపొందించిన ఆ యాప్ పేరే ‘అల్లో’. సంప్ర‌దాయ చాటింగ్ యాప్ ల‌కు భిన్నంగా ఈ అల్లో […]


 • పండుగ తర్వాత ‘పవర్‌’ షాక్‌!

  18న ఏపీఈఆర్‌సీకి టారిఫ్‌ ప్రతిపాదనలు రూ.7,122 కోట్ల లోటును పూడ్చుకునే ప్రయత్నం సంక్రాంతి తర్వాత విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌) కొత్త విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీన విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి సమర్పించ నున్నాయి. రెండు డిస్కమ్‌లకు కలిపి రూ.7,122 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు పేర్కొన్నాయి. వినియోగదారులపై టారిఫ్‌ల పిడుగు పరోక్ష రాబడిపై కూడా విద్యుత్‌ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 2016–17కి కొత్త […]


 • కొత్త విధానాలు.. కేరాఫ్‌ అమరావతి

  దేశంలో ఏ కొత్త విధానానికి నాంది పలికినా దానికి కేరాఫ్‌ అడ్ర్‌సగా అమరావతి, విజయవాడ నిలుస్తున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం డిజిధన్‌ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో కేంద్ర మంత్రి వెంకయ్యతో కలిసి సీఎం పాల్గొన్నారు. సుమారు 80కుపైగా బ్యాంకులు, మొబైల్‌ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. పెద్ద నోట్ల రద్దును దేశంలో ప్రోత్సహించిన మొట్టమొదటి సీఎంని తానేనని చంద్రబాబు అన్నారు. నవంబర్‌ 8 నాటికి రాష్ట్రంలో […]