Articles Posted in the " Cinema " Category

 • దర్శకుడి బండారం బయటపెట్టిన కంగనా

  బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వెరీ డిఫరెంట్ . చాలా ఫ్రాంక్. ఎలాంటి విషయాన్ని అయినా ఓపెన్ గా చెప్పేస్తుంది. తాజగా దర్శకుడు కరణ్ జోహార్ పరువు తీసేసింది కనగాన. తన జీవితంలో విలన్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కరన్ జోహార్ అని, తన బయోపిక్ తీస్తే.. అందులో విలన్ పాత్ర కరన్ దేనని, ఆ పాత్రను అతడే పోషిస్తే మరింత బాగుంటుందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కంగనా. కారణo కొత్త టాలెంట్ పరిశ్రమలోకి రానివ్వడని, […]


 • భారీ క్రేజ్ నడుమ విడుదలవుతున్న ‘ఘాజి’ !

  హీరో రానా నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘ఘాజి’ ఈరోజే భారీ పాజిటివ్ క్రేజ్ నడుమ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతోంది. ఆరంభంలో అంతగా ఆకట్టుకోకపోయినా మెల్లగా టీమ్ చేసిన ప్రమోషన్ల ద్వారా సినిమాలో ఏం చెప్పబోతున్నారో బయటకు తెలియడంతో అందరిలోనూ చిత్రం పట్ల ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి మెల్లగా పెరుగుతూ క్రేజ్ గా మారిపోయింది. దీంతో చిత్రంపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. పైగా […]


 • మిల్కీబ్యూటీని కంటతడి పెట్టించిన స్కెచ్‌

  కొన్ని సినిమా కథలు ఆర్టిఫిషియల్‌ అనిపిస్తే మరి కొన్ని హార్ట్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ రెండవ కోవకు చెందిన కథలో తాను నటిస్తున్నానంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా.బాహుబలి చిత్రంతో బ్రహ్మాండమైన పాపులారిటీని పెంచుకున్న ఈ భామ ఆ తరువాత ఆ స్థాయి పాత్రల్లో నటించలేదు. తాజాగా విక్రమ్‌తో రొమాన్స్‌ చేస్తున్నారు. విజయ్‌చందర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి స్కెచ్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో విక్రమ్‌ సంఘ విద్రోహుల్ని స్కెచ్‌ వేసి అంతం చేస్తారట. మదురై నేపథ్యంలో పలు […]


 • ప్రభాస్ సినిమా ప్రారంభమైంది !

  ‘బాహుబలి’ చిత్రంతో హీరో ప్రభాస్ నేషనల్ లెవల్ గుర్తింపు పొంది, టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు ప్రతిమ పెట్టే స్థాయికి ఎదిగాడు. ప్రభాస్ ఇంతలా కీర్తి పొందటం ఆయన అభిమానులకు సంతోషంగానే ఉన్నా మరోవైపు ఇన్నేళ్ల పాటు కేవలం రెండు సినిమాలకే పరితమవడం మాత్రం వారిని కాస్త నిరుత్సాహపరిచింది. అందుకే బాహుబలి షూట్ పూర్తయిందని తెలియాగానే నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలుపెడతారోనని అందరూ ఆశగా ఎదురుచూశారు. వాళ్ళ ఆశలను నెరవేరుస్తూ ఈరోజు ప్రభాస్ కొత్త చిత్రం అధికారికంగా లాంచ్ […]


 • సినిమా ఏమో కానీ రచ్చ మొదలైంది

  తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితచరిత్ర మీద తాను సినిమా తీయనున్నట్లు ఎన్టీఆర్ కుమారుడు.. ప్రముఖ నటుడు బాలకృష్ణ అనౌన్స్ చేశారు. ఆయన ప్రకటన విడుదలైన నాటి నుంచి ఈ సినిమా విషయం మీద ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్టీఆర్ జీవితచరిత్ర అన్న వెంటనే సినిమాలతో పాటు.. రాజకీయ ప్రస్థానం ఉంటుంది. మరి.. అదే జరిగితే లక్ష్మీ పార్వతిని ఎలా చూపిస్తారు? ఎన్టీఆర్ ను పదవి నుంచి తొలగించి.. చంద్రబాబు సీఎం అయిన ఎపిసోడ్ […]


 • చిరు చిత్రాలతో గేమ్‌

  చిరంజీవి నటించిన 150 చిత్రాల్లో ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో రూపొందించిన గేమ్‌ ‘మెగా 150–బాస్‌ ఇన్‌ గేమ్‌’. చిరంజీవి అభిమా నులు సతీశ్‌బాబు ముత్యాల, ప్రసాద్‌ బొలిశెట్టి, పవన్‌ కొర్లపాటి, శేషు లొశెట్టి స్థాపించిన ‘ఎం యాప్‌ సోర్స్‌ డెవలప్‌మెంట్‌’ కంపెనీ ఈ గేమ్‌ని రూపొందించింది. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత ‘దిల్‌’ రాజులు హైదరాబాద్‌లో ఈ గేమ్‌ని విడుదల చేశారు. ఈ గేమ్‌ రూపకర్తలు మాట్లాడుతూ –‘‘ఈ గేమ్‌లో 14 లెవల్స్‌ ఉంటాయి. […]


 • సర్దార్‌ దెబ్బకి మొత్తం సెట్‌ అయిపోయారు..

  ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ప్రమోషన్‌ విషయంలో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అతి విశ్వాసానికి పోయి చాలా తప్పులు చేసారు. పవన్‌కళ్యాణ్‌ సినిమానే కదా ఎవరు చూడరంటూ పబ్లిసిటీ పరంగా ఎన్నో పొరపాట్లు చేశారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్‌ పబ్లిసిటీ వారిని విపరీతంగా ఇబ్బంది పెట్టింది. అభిమానుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కనీసం థియేట్రకల్‌ ట్రెయిలర్‌ని అఫీషియల్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడానికి కూడా చాలా టైమ్‌ తీసుకున్నారు. ఆడియో వేడుక మిస్‌ అయినవాళ్లు ఫాన్స్‌ టీవీలో రికార్డ్‌ చేసి […]


 • దాసరిని పరామర్శించిన చిరంజీవి, అల్లు అరవింద్, అంబటి రాంబాబు

  కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. తన బావమరిది అల్లు అరవింద్ తో కలసి ఆయన కిమ్స్ హాస్పిటల్ కు వచ్చారు. వైకాపా నేత అంబటి రాంబాబు, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కూడా ఆసుపత్రికి వచ్చి దాసరిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాసరి కోలుకుంటున్నారని తెలిపారు.


 • శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తూ పుష్పగుచ్ఛం పంపిన పవన్ కల్యాణ్

  తాను నటించిన సినిమాలే ఇప్పటికీ కొన్ని చూడలేదని చెప్పుకునే జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇతర హీరోకి చెందిన సినిమాను చూశారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. శ్రీనివాస్ రెడ్డి నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాను పవన్ చూశారు. సినిమాలో నటించిన వారిని, యూనిట్ సభ్యులను ఆయన మెచ్చుకున్నారు. అంతేకాదు, శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తూ, ఓ పుష్పగుచ్ఛాన్ని కూడా పంపారు. “మంచి సినిమా చేశావు. సినిమాను చాలా ఎంజాయ్ చేశా. నీకు బెస్ట్ […]


 • మెగా హీరో కోసం మహేష్

  టాలీవుడ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టేసి కలిసి పోతున్నారు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోలు ఒకరి సినిమా ఓపెనింగ్లకు ఒకరు హాజరవుతూ అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాదు ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందించటంతో పాటు పాటలను కూడా తన సోషల్ మీడియా పేజ్లలో ప్రమోట్ చేస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. అదే బాటలో ఒక మెగా హీరో పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా పేజ్లో రిలీజ్ చేయనున్నాడు. గోపిచంద్ మలినేని […]