Articles Posted in the " Health-Tips " Category

 • సంతాన భాగ్యానికి ఎన్నో దారులు… ఎంపిక మీదే!…

  సులభమైన సంతాన నిరోధక పద్ధతి ఏది…? వివాహమైన దంపతులకు సంతాన భాగ్యం ఓ ఆకాంక్ష.. ఓ ఆశ.. ఓ అవసరం. తమ వారసుల కోసం తహతహలాడని వారుండరు. ప్రతి స్త్రీ కూడా మాతృత్వాన్ని ఆస్వాదించాలని, అనుభవించాలని ఉవ్విళ్లూరుతుంది. ప్రతి స్త్రీ అమ్మా అని… ప్రతి పురుషుడు నాన్నా అని పిలిపించుకునేందుకు ఈ సృష్టిలో ఎన్నో సహజ మార్గాలున్నాయి. ఆ అదృష్ట భాగ్యం మాకు లేదే అని మధనపడిపోతున్న వారి కోసం వైద్య శాస్త్రం ప్రత్యామ్నాయంగా కొన్ని విధానాలను […]


 • లేటు వయసు వివాహాలతో.. తగ్గనున్న సంతాన సాఫల్యత

  గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మందిలో సమస్య ప్రతి ఆరు జంటల్లో ఒకరికి సంతానలేమి బాధ అనూ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వాహకుల వెల్లడి ఆలస్యంగా వివాహాలు చేసుకోవడంవల్ల దంపతు ల్లో సంతాన సాఫల్యంతగ్గే అవకాశం ఉంటుందని అనూ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ అనురాధ అన్నారు. ఒకప్పుడు 40 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు యుక్త వయసువారిలో కూడా కనిపిస్తోందన్నారు. లేటు వయసు వివాహాలతోపాటు […]


 • ప‌రీక్ష‌కు సిద్ధ‌మైన హెచ్ఐవీ టీకా..

  ద‌క్షిణాఫ్రికాలో అభివృద్ధి హెచ్ఐవీని నియంత్రించేందుకు అభివృద్ధి చేసిన టీకా ట్రయ‌ల్‌ర‌న్‌కు సిద్ధ‌మ‌వుతోంది. హెచ్ఐవీని నియంత్రించే విష‌యంలో శాస్త్ర‌వేత్తలు చివ‌రిద‌శ‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా హెచ్‌వీటీఎన్ 702 అనే టీకా ప్ర‌స్తుతం ప‌రీక్ష‌ల ద‌శ‌కు చేరుకుంది. గ‌తంలో ప‌రీక్షించిన టీకాలు స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది. హెచ్‌వీటీఎన్ 702 క‌నుక విజ‌య‌వంత‌మైతే హెచ్ఐవీ నియంత్ర‌ణ‌కు స‌రికొత్త టీకా వ‌చ్చేసిన‌ట్టేన‌ని శాస్త్రవేత్త‌లు భావిస్తున్నారు. స‌రికొత్త టీకాను హెచ్ఐవీ సోకిన 5,400 మంది స్త్రీ,పురుషుల‌పై పరీక్షించ‌నున్న‌ట్టు అమెరికాలోని […]


 • హ్యాకింగ్‌.. షేకింగ్‌..

  హ్యాకింగ్‌… ప్రపంచ ఆన్‌లైన్‌ భద్రతనే ప్రశ్నిస్తున్న పదం. మామూలు దొంగలకు దొంగతనం చేయాలంటే తలుపులు పగలగొట్టాలి. గోడలకు కన్నాలు వేయాలి. మారణాయుధాలతో బెదిరించాలి. కానీ హ్యాకర్లకు అవేమీ అవసరం లేదు. ఓ కంప్యూటర్, దానికి ఇంటర్నెట్, కొన్ని ఇతర పరికరాలు ఉంటే చాలు. ఇంట్లో కూర్చుని కాళ్లు కదలకుండా కోట్లు కొట్టేస్తారు. దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేస్తారు. ఎంత పెద్ద కంపెనీలనైనా కాళ్ల బేరానికి రప్పిస్తారు. ప్రపంచదేశాలన్నిటికీ పెద్దన్న లాంటి అమెరికానే హ్యాకర్లు కొన్ని గంటల […]


 • 14న ఆకాశంలో అద్భుతం!

  ఇప్పుడు చూడకపోతే మళ్లీ 2034లోనే… విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఈ నెల 14న ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఆరోజున గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంత దగ్గరగా భూమి వైపునకు చంద్రుడు రానున్నాడు. 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది చందమామ. సాయంత్రం 5.45 గంటల నుంచి రెండు గంటల పాటు ఈ అద్భుతం ఆకాశంలో ఆవిష్కృతమవుతుంది. అదేరోజున కార్తీక పౌర్ణమి కూడా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు తప్పితే మళ్లీ 2034 వరకు చంద్రుడిని […]


 • ఇది మా కుటుంబం

  కుటుంబం.. ఇది మా కుటుంబం… అంటున్నారు సమంత. అనడం మాత్రమే కాదు.. తన కొత్త కుటుంబంతో సరదాగా షికార్లకు వెళుతున్నారు. కాబోయే మరిది, తోడికోడలు అక్కినేని అఖిల్, శ్రీయా భూపాల్‌తో కలసి తన కాబోయే భర్త నాగచైతన్యతో సరదాగా ఓ ఫొటో దిగారు సమంత. నలుగురూ ఒకే ఫ్రేములోకి వచ్చిన ఫొటోను బయటపెట్టేశారు. అన్నదమ్ములతో పాటు తోడికోడళ్లు కూడా భలే కలసిపోయారని అభిమానులు ఈ ఫొటో చూసి మురిసిపోతున్నారు. అఖిల్ నిశ్చితార్థం డిసెంబర్ 9న, పెళ్లి వచ్చే […]


 • మనసు అదుపులో ఉంటేనే…

  ఏనుగంత గొప్ప ప్రాణి లోకంలో మరొకటి ఉండదు. విఘ్నేశ్వరుడంతటివాడు ఏనుగు ముఖంతో ఉంటాడు. ‘సుముఖః’ అన్నారు తప్ప, ‘గజముఖః’ అనలేదు. ఎందుకంటే ఏనుగు ముఖం వంక చూస్తే చాలు…. లక్ష్మీస్థానం చూసినట్లు. లక్ష్మీస్థానాలు ఐదింటిలో ఏనుగు కుంభస్థలం ఒకటి. దానికేసి చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అందుకే మహావిద్వాంసులైన వాళ్ళను గజారోహణం చేయిస్తారు. ఏనుగు సర్వోత్కృష్టమైన ప్రాణి. కానీ అసలు రహస్యం వేరే ఉంది. మూడే మూడు ఉన్నాయి. వాటి వంక చూసినప్పుడు మన ప్రయత్నం లేకుండానే […]


 • కేసీఆర్ చేతే పదవేం కావాలని అడిగించుకున్నారు?

  కొత్త జిల్లాల ఏర్పాటు చేసి రెండు వారాలు మాత్రమే అయ్యింది. ఆ సందర్భంగా పెట్టిన పేర్లలో.. యాదాద్రి పేరును యాదాద్రి భువనగిరిగా మార్చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటమే కాదు.. వెనువెంటనే అధికారుల్ని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇదంతా ఎలా జరిగిందంటే.. కేసీఆర్ మిత్రుడు చెప్పిన ఒకే ఒక్క మాటకే. ఇంతకీ ఆ మిత్రుడు ఎవరంటే.. ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ.. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎలిమినేటి […]


 • జిల్లాలు సరే.. రికార్డులేవి..?

  దసరా సందర్భంగా తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలోనే అతిపెద్ద పరిపాలనా సంస్కరణగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త జిల్లాలతో పాలన ప్రజలకు మరింత చేరువవుతోందంటున్నారు. జిల్లాలకు అనుగుణంగా కొత్త పోస్టులు కూడా ప్రకటించేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. కొత్త జిల్లాల్లో పాలన మాత్రం అనుకున్నతం తేలికగా అయ్యే పనిలా కనిపించడం లేదు. కొత్త కలెక్టరేట్లు ఓపెన్ చేసినంత వేగంగా.. రికార్డులు అందుబాటులోకి రాలేదు. రికార్డులన్నీ ఓ కాపీ పాతజిల్లా కేంద్రంలో ఉంచి.. మరో కాపీ కొత్త […]


 • నో ఫోన్స్ ప్లీజ్..

  ప్రపంచ వ్యాప్తంగా సైబర్ భద్రత కీలకంగా మారుతున్న తరుణంలో.. ప్రధాని నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ సమావేశాలకు ఫోన్లు తీసుకురావద్దని మంత్రులందరికీ హుకుం జారీ చేశారు. ఇప్పటికే పీఎంఓ నుంచి అన్ని మంత్రిత్వశాఖ ఆఫీసులకూ సర్క్యులర్లు వెళ్లిపోయారు. గతంలో కూడా అడపాదడపా కీలక నిర్ణయాలు లీకయ్యాయి. అయితే వీటివల్ల పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదు. కానీ పీఓకేలో సర్జికల్ దాడుల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్థాన్ హ్యాకర్లు కేంద్రమంత్రుల్ని లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలతో కేంద్రం […]