Articles Posted in the " National " Category

 • నేడు యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ .. బీజేపీకి దీటైన జవాబు?

  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి ప్రియాంకా గాంధీ కూడా దిగుతున్నారు. నేడు అమేధీలో జరగనున్న బహిరంగ సభలో సోదరుడు రాహుల్ గాంధీతో పాటు ఆమె వేదికను పంచుకోనున్నారు. తద్వారా ఆమె బీజేపీ విమర్శలకు సమాధానం చెప్పనున్నారు. నిన్న స్మృతీ ఇరానీ మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ ఇంతవరకు ప్రచారంలో పాల్గొనకపోవడానికి కారణం తనకు తెలుసన్నారు. అమేధీలో ఓటర్లకు ప్రియాంక, రాహుల్ చాలా హామీలిచ్చారని, ఇంతవరకు అవి నేర్చకపోవడంతో మొహం చెల్లక రాలేదని ఎద్దేవా చేశారు. ఆమె విమర్శలకు సమాధానంగా […]


 • పెళ్లి ఖర్చు రూ. 5 లక్షలు దాటిందా?.. పదిశాతం పన్ను కట్టాల్సిందే!

  వివాహ సమయాల్లో పెరిగిపోతున్న దుబారా ఖర్చులను తగ్గించేందుకు సరికొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది. ఇక నుంచి పెళ్లి ఖర్చు రూ. 5 లక్షలు దాటితే అందులో పదిశాతం ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది. ఎంపీ పప్పు యాదవ్ సతీమణి, కాంగ్రెస్ ఎంపీ రంజిత రంజన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాహ బిల్లు-2016లో ఈ మేరకు ప్రతిపాదన తీసుకొచ్చారు. వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడంతోపాటు, వృథా ఖర్చును తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ప్రవేటు బిల్లుగా పరిగణించి వచ్చే లోక్‌సభ […]


 • ఆరోజు రాత్రే ఐదుగురు మంత్రులతో..!

  జయలలిత నెచ్చెలి శశికళ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు వేగవంతం చేసారు. ఉన్న అన్ని అవకాశాలను అనే ఉపయోగించుకుంటున్నారు. ప్రయత్నాలు చేత్తోనే మరో వైపు పన్నీర్ సెల్వం ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సోమవారం అన్నా డీఎంకె పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం అంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జయలలిత మరణించిన రోజు రాత్రే అన్నా డీఎంకే పార్టీ ని చీల్చే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆమె అన్నారు. అమ్మ మరణించిన రోజు రాత్రే […]


 • పెద్ద నోట్లకు నకిలీ నోట్లు! రంగంలోకి దిగిన ఎన్ఐఏ, బీఎస్ఎఫ్ దళాలు

  పెద్ద నోట్లకు ‘నకిలీ’ కరెన్సీ ట్రయల్ రన్ మొదలైంది. రూ.2 వేలు, రూ.500 నకిలీ నోట్లను ఐఎస్ఐ భారత్ లో ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ నకిలీ కరెన్సీ బాగోతం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), సరిహద్దు రక్షణ దళాలు (బీఎస్ఎఫ్) రంగంలోకి దిగాయి. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ, రెండు వేల రూపాయల నకిలీ నోట్లు నలభై తీసుకువెళుతున్న అజిజుర్ రహమాన్ (26) అనే వ్యక్తిని […]


 • బంగ్లాదేశ్ కథ ముగించేశారు

  ఊహించిన ఫలితమే వచ్చింది. కాకపోతే కాస్త ఆలస్యంగా. బలహీన ప్రత్యర్థిని తొందరగా చుట్టేద్దామని భారత్‌ భావించినా… ఆట ఐదో రోజు రెండు సెషన్ల వరకు సాగింది. ఎట్టకేలకు ఆఖరి రోజు 65.3 ఓవర్ల పోరాటం అనంతరం బంగ్లాదేశ్‌ తలవంచింది. స్పిన్, పేస్‌ కలగలిసి కొట్టిన దెబ్బకు ఆ జట్టు కోలుకోలేకపోయింది. సొంతగడ్డపై భారత్‌ తన హవా కొనసాగిస్తూ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వరుసగా ఆరో టెస్టు సిరీస్‌ సొంతం. కెప్టెన్‌గా పరాజయమనేదే లేకుండా వరుసగా […]


 • ఇద్దరు క్రీడాకారిణులపై అత్యాచారం చేసిన కోచ్

  ఇద్దరు జాతీయ స్థాయి తైక్వాండో క్రీడాకారిణులపై కోచ్ అత్యాచారం చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఇద్దరు క్రీడాకారిణులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, 9వ తరగతి చదువుతున్న క్రీడాకారిణి కోచ్ కు ఫోన్ చేయగా… ఇంటికి రమ్మన్నాడు. అనంతరం మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, అత్యాచారం చేశాడు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత కోచ్ ను ప్రశ్నించింది. దీంతో, […]


 • త‌మిళ‌నాడులో అస‌లేం జ‌రుగుతోందంటే…

  త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌లలిత వార‌స‌త్వ పోరు తారాస్థాయికి చేరింది. సాక్షాత్తు అమ్మ స‌మాధి నుంచి సెల్వం తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేశారు.అనంత‌రం ఆయ‌న‌పై చిన్నమ్మ శ‌శిక‌ళ మండిప‌డింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో సీక్రెట్ బ‌స్సుయాత్ర‌కు శ్రీ‌కారం చుట్టింది. మ‌రోవైపు ఈ ప‌రిణామాన్ని కేంద్ర ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు త‌మిళ‌నాడులో ఏం జ‌రిగిందంటే.. — మంగ‌ళ‌వారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మందీమార్బలం లేకుండా ఒక్కడే వచ్చిన పన్నీర్‌సెల్వం.. దాదాపు […]


 • ట్రిపుల్ సెంచరీ వీరుడికి నిరాశే!

  టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీలు సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేపై నమ్మకం ఉంచారు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు నుంచి రహానే గాయం కారణంగా వైదొలగడంతో అతడి స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడు. ఆ టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. కానీ అందరూ ఊహించినట్లుగా జరగలేదు. రేపు (గురువారం) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టెస్టులో ట్రిపుల్ వీరుడు కరుణ్‌కి […]


 • రెండుగా చీలిన అన్నాడీఎంకే.. రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు!

  తమిళనాడులో మంగళవారం రాత్రి నుంచి రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న శశికళకు పన్నీర్ సెల్వం షాకివ్వడంతో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం రెండుగా చీలిపోయింది. పన్నీర్‌కు 50 మంది వరకు ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. దీంతో శశికళ బలం 85కు పడిపోయింది. తనకు మద్దతు పలుకుతున్న 85మంది ఎమ్మెల్యేలతో ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే […]


 • మళ్లీ మాజీ అయిపోయిన పన్నీర్ సెల్వం.. రాజీనామాను ఆమోదించిన గవర్నర్

  తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం చేసిన రాజీనామాను ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదించారు. ఆ విషయాన్ని చెన్నైలోని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో, పన్నీర్ మరోసారి మాజీ సీఎం అయిపోయారు. తన పదవికి నిన్న రాజీనామా చేశారు పన్నీర్. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నానని రాజీనామా లేఖలో తెలిపారాయన. దివంగత జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం… సీఎం పీఠంపై జయ కూర్చోలేని పరిస్థితులు తలెత్తినప్పుడల్లా ముఖ్యమంత్రిగా […]