Articles Posted in the " Political " Category

 • సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి: పవన్ కల్యాణ్

  సంక్రాంతి పండగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ఈ సంక్రాంతి పండగ ఉద్దానం కిడ్నీ బాధితులకు సాంత్వన కలుగజేయాలని  కోరుకున్నారు. కరెన్సీ రద్దు వంటి గాయాల బారిన పడకుండా, రాజకీయ పెద్దల నుంచి సంక్రాంతి పండగ ప్రజలను కాపాడాలని పవన్ కోరుకున్నారు.


 • తెలంగాణలో పాలన సరిగా లేదు: కోదండరామ్

  తెలంగాణలో పాలనపై జేఏసీ చైర్మన్ కోదండరామ్ మరోమారు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలన  సరిగా లేదని విమర్శించారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, సీమాంధ్ర పాలన నచ్చకే తెలంగాణ తెచ్చుకున్నామని, ప్రతి ఒక్కరికీ చదువు, వైద్యం, ఉద్యోగం అందాలన్నదే తమ కమిట్ మెంట్ అని అన్నారు. కాగా, ఫార్మాసిటీ నిర్మాణం కోసం వేలాది ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోందంటూ ఇటీవల ఆయన నిరసన తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు మద్దతు ఇస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని […]


 • 2019లో పవన్ కల్యాణ్ కు ఆశాజనకంగా ఉండదనుకుంటున్నా: జేసీ దివాకర్ రెడ్డి

  2019లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఆశాజనకంగా ఉండదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో పారిశ్రామిక వేత్త పుట్ట గుంట సతీష్ నివాసానికి ఆయన వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు పవన్ టెంపర్ మెంట్, ఆయనకు ఉన్నశక్తి చాలదని, తాను అంతకంటే ఎక్కువ మాట్లాడటం మంచిది కాదని అన్నారు. సినిమా హీరోలకు ఓట్లేసి పరిస్థితి తగ్గిపోయిందన్నారు. ఎంతో గ్లామర్ ఉన్న ఎన్ టి […]


 • మోదిని ఓడిస్తా

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడించి చూపిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు ఓ తప్పుడు నిర్ణయమని విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రపంచమంతా తప్పుపట్టిందన్నారు. తప్పుడు నిర్ణయం కారణంగా ప్రపంచంలో అవహేళనకు గురైన తొలి ప్రధానిగా మోదీ నిలిచిపోతారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుపై బుధవారం జరిగిన జన్‌ వేదన సభలో రాహుల్‌ మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే దేశానికి మంచి రోజులు (అచ్ఛేదిన్‌) వస్తాయన్నారు. నోట్ల […]


 • మన్మోహన్‌కు.. మోదీకి.. తేడా ఏమిటంటే..?

  ‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రసంగాలన్నీ ఇంగ్లి్‌షలోనే ఉండేవి. వాటిని నాలాంటి గ్రామీణులెవ్వరూ అర్థం చేసుకోలేకపోయేవారు. ప్రస్తుత ప్రధాని మోదీ మాకు అర్థమయ్యే భాషలో చక్కగా హిందీలో మాట్లాడుతాడు అందుకే ఆయన ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నాం. ఆయనపై మా అందరికీ నమ్మకం ఉంది’ … ఉత్తర్‌ ప్రదేశ్‌ లఖ్‌నవ్‌కు చెందిన 29 ఏళ్ల ఉబేర్‌ ట్యాక్సీ డ్రైవర్‌ రాఘవేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. యూపీ ఎన్నికల ప్రచారంలో నోట్ల రద్దు ప్రధాన పాత్ర పోషించనుంది. రద్దు […]


 • విద్యా విధానంలో అంతరాలు తొలగాలి

  ప్రస్తుత విద్యావిధానంలో ఉన్న అంతరాలు తొలగిపోవాల్సిన అవసరముందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఇందులో కోదండరాం మాట్లాడుతూ చదువులో అన్నివర్గాల ప్రజలకు సమానావకా శాలు అభించడం లేదనీ, కొందరిని నిరాదరణ వెంటాడుతోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదన్నారు. విద్యార్థులు సంఘటిత శక్తిగా మారితేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందన్నారు. Education, Professor kodanda Ram, […]


 • రిపబ్లిక్‌డేలో ‘పన్నీర్‌‘ పతాకావిష్కరణ! రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి

  చెన్నై మెరీనా బీచ్‌లో ఈనెల 26న జరుగనున్న గణతంత్ర దినోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌కు బదులుగా ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌ సెల్వం జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్‌డేలో ముఖ్యమంత్రి పతాకావిష్కరణ చేయనుండటం విశేషం. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్ విద్యాసాగరరావు రాష్ట్రానికి ఇన్‌ఛార్జిగా ఉంటున్నారు. ముంబాయిలో జరిగే రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొని ఆయన పతాకావిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు రిపబ్లిక్‌ డే రోజున జాతీయ పతాకావిష్కరణ చేయమంటూ స్థానిక రాజ్‌భవన్ కార్యాలయపు అధికారులు ముఖ్యమంత్రి […]


 • పవన్‌కల్యాణ్‌కు సాయపడలేదు: ఎలమంచిలి ఎమ్మెల్యే రమేష్‌ బాబు

  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు శ్రీకాకుళం పర్యటనలో తాను సహకరించలేదని, ఏ విధంగానైనా తాను సాయపడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ప్రకటించారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల పవన్‌కల్యాణ్‌ శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయనకు విశాఖ నుంచి తానే వాహనం (ఎండీవర్‌ కారు) ఏర్పాటు చేసినట్టు పార్టీకి ఫిర్యాదు చేశారన్నారు. ఎండీవర్‌ కారు తమ కుటుంబంలో ఎవ రికీ లేదని స్పష్టంచేశారు. పంచకర్ల […]


 • వైఎస్‌ ప్రాజెక్టులకు గేట్లెత్తుతున్నావ్‌

  ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పుడు చంద్రబాబు వచ్చి గేట్లు ఎత్తుతున్నాడు. వైఎస్సార్‌కు క్రెడిట్‌ ఇవ్వాల్సిన ప్రాజెక్టులకు లస్కర్‌ మాదిరిగా గేట్లు ఎత్తి, తానే ఆ ప్రాజెక్టుల కోసం కలలు కన్నానని చెబుతున్నారు. అదీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ అనే దుర్బుద్ధితో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం డ్యాంలో నీరు ఉన్నప్పటికీ నీరు ఇవ్వడంలేదని, […]


 • చీలిపోనున్న సమాజ్ వాదీ పార్టీ?

  సమాజ్ వాదీ పార్టీ రెండుగా చీలిపోనుందా?. తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్ధుల్లో ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గానికి చెందిన వారికి మొండిచేయి ఎదురవడంతో ఆయన వారందరిని రెబెల్స్ గా బరిలోకి దిగాలని కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల్లో 325 మంది పేర్లను ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లు బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ములాయం విడుదల చేసిన లిస్టులో ప్రస్తుత […]