Articles Posted in the " Telangana " Category

 • ఇంకా నయం.. ఎవరెస్ట్‌పై ర్యాలీ చేసుకోమనలేదు..!

  పోలీసుల తీరుపై కోదండరాం వ్యంగ్యం రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిరుద్యోగుల నిరసన ర్యాలీని నిర్వహించుకోవాలన్న పోలీసుల ప్రతిపాదనపై టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఇంకా నయం.. ఎవరెస్ట్ శిఖరం మీద చేసుకోమన్నారు కాదు’’ అని ధ్వజమెత్తారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఫలితం ఉండబోదన్నారు. ర్యాలీని శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ర్యాలీ పూర్తయ్యే వరకు నిద్రపోబోమని తేల్చి చెప్పారు. జేఏసీ ఆవిర్భావం […]


 • కోట్లు దోచుకుంటే ఏం చేస్తున్నారు?

  ‘కమర్షియల్‌’ స్కాంపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌ ⇒ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా పెంచాలని ఆదేశం ⇒ సీఐడీ విచారణపై ఆరా..ఆరోపణలెదుర్కొంటున్న అధికారులపై విచారణ బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్‌ అయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ రాబడికి గండి కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ సంబంధిత విభాగ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కేవలం రూ.60 కోట్ల వరకే స్కాం జరిగినట్లు నివేదికిచ్చారని, కానీ సీఐడీ విచారణలో వందల కోట్లు […]


 • 197 కేసులు.. 125 అరెస్ట్‌లు

  నయీమ్‌ కేసులో ఇప్పటివరకు 197 కేసులు నమోదు చేసి, 125 మందిని అరెస్ట్‌ చేశామని సిట్‌ చీఫ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 330 మందిని పీటీ వారెంట్‌పై విచారించామని, 107 మంది పోలీస్‌ కస్టడీలోనే ఉన్నారన్నారు. 878 సాక్షులను విచారించామ ని, 18 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు చెప్పారు. 14 మంది నయీమ్‌ అనుచరులపై పీడీ యాక్టులు మోపామని, వారిలో పాశం శ్రీను, సందెలా సుధాకర్, అబ్దుల్‌ నాసర్, బాచు నాగరాజు, పులి నాగరాజు, […]


 • నా తండ్రి అసమాన నాయకుడు, ధీశాలి, యోధుడు.. ఐ లవ్ యూ డాడ్: కేటీఆర్

  తన తండ్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కన్న అతి గొప్ప కుమారుడు తన తండ్రి అని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసమానమైన నాయకుడు, ధీశాలి, యోధుడు తన తండ్రి అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘హ్యాపీ బర్త్ డే డాడ్’ అని ట్వీట్ చేశారు. ఆయన కొడుకుగా పుట్టడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. దీనికితోడు, ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కేసీఆర్ ఫొటోను కేటీఆర్ అప్ లోడ్ చేశారు. […]


 • 21, 22 తేదీల్లో ఏపీలో కేసీఆర్… పర్యటన ఖరారు!

  తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తన కోరిక సిద్ధిస్తే, తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఆభరణాలు చేయిస్తానని ఆయన మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కోరిక తీరడంతో, ప్రభుత్వం తరఫున తయారు చేయించిన రూ. 5 కోట్ల విలువైన ఆభరణాలను తీసుకుని ఆయన వెంకటేశ్వరుని దర్శనానికి రానున్నారు. 21 మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకునే కేసీఆర్, రాత్రికి తిరుమలలో బస చేసి, ఆపై 22న ఉదయాన్నే […]


 • తెలంగాణ బిడ్డకు ఆంధ్రలో భారీ క్రేజ్

  అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలోని వివిధ రకాల వివక్షను ఆమె వివరించినపుడు ముఖ్యంగా విద్యార్థులు కరతాళధ్వనులతో స్పందించారు. జై తెలంగాణ..జై ఆంధ్రప్రదేశ్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కవిత తాను ఈ ప్రాంగణంలోకి నడిచివస్తుంటే ఆధునిక స్త్రీ చరిత్రను పునర్‌లిఖిస్తుందని గురజాడ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయని అన్నారు. గురజాడ చాటిన ఆదర్శాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. వివిధ దేశాల్లో […]


 • మరీ.. ఇంత కక్కుర్తి ఏంటి సానియా?

  ఒక రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే వారు ఎంత బాధ్యతగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి ఇమేజ్ వల్ల రాష్ట్ర ఇమేజ్ పెరగాలే కానీ.. తగ్గకూడదు. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యవహారం చూస్తే.. ఆమె వల్ల రాష్ట్రానికి పెరిగే ఇమేజ్ సంగతి ఎలా ఉన్నా.. తాజాగా ఆమె వైఖరి కారణంగా రాష్ట్రానికి డ్యామేజ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సేవా పన్నును చెల్లించని వ్యక్తిగా వార్తల్లో నిలవటమే కాదు.. ఆ […]


 • సాగునీటితో రైతుల ముఖాల్లో ఆనందం

  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘మిషన్‌ కాకతీయ’ ద్వారా కుంటలు, చెరువులకు మరమ్మతులు చేసి సాగునీటిని అందిస్తుండడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోం దని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట, మర్పల్లి మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం రవాణాశాఖ మంత్రి పి.మహేం దర్‌రెడ్డితో కలిసి వచ్చారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని తెలుసుకొని వాటిని రద్దు చేసుకున్నారు. […]


 • చంద్రబాబును విలన్ గా చూపించాలి…ఎన్టీఆర్ సినిమాకు హీరో నేనే!: నాదెండ్ల భాస్కరరావు

  ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పై సినిమా తీస్తానని ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రకటించిన తరువాత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సినిమాలోని అంశాలపై ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి పలు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ రాజకీయనాయకుడు నాదెండ్ల భాస్కరరావు కూడా హెచ్చరికలు చేశారు. ఎన్టీఆర్ పై నిర్మించే సినిమాకు హీరోను తానేనని ఆయన తెలిపారు. ఈ సినిమాలో అసలు విలన్ చంద్రబాబునాయుడని ఆయన చెప్పారు. టీడీపీని […]


 • ఎన్ఏఆర్ఎఫ్ ప్రాజెక్టు మోడల్‌ను ఆవిష్కరించిన కేటీఆర్

  షామిర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీలో ఇవాళ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. బ‌యోమెడిక‌ల్ రీస‌ర్చ్ కోసం ఏర్పాటు చేయ‌నున్న నేష‌న‌ల్ యానిమ‌ల్ రిసోర్స్ ఫెసిలిటి కేంద్రానికి సంబంధించిన బిల్డింగ్ ప్లాన్‌ను ఆవిష్క‌రించారు. జంతు ప‌రిశోధ‌నా కేంద్రానికి సంబంధించిన మోడ‌ల్‌ను కూడా మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఎంఎన్ పార్క్‌కు చెందిన ఐహ‌బ్ ఫేజ్ టూకు సంబంధించి శంకుస్థాప‌న కూడా చేశారు. జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్న క్యాట‌లిస్టు హ‌బ్‌ సంస్థ‌కు కూడా ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. […]