Articles Posted in the " World " Category

 • భారతీయులను భయపెట్టిన ట్రంప్ ఎలా బుట్టలో పడేశాడో తెలుసా?

  ముస్లింలపై ట్రావెల్ బ్యాన్, హెచ్1బీ వీసాలపై ఆంక్షలు.. అంటూ భారతీయులను బెంబేలెత్తించిన డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ ను వినియోగించుకునేందుకు భారతీయుులు పోటీ పడుతున్నారు. సగటున వారానికి ముగ్గురు చొప్పున భారతీయులు ఈబీ-5 వీసా ప్రోగ్రాంలో చేరిపోతున్నారు. ఇంతకీ ఈబీ-5 వీసా ప్రోగ్రాం అంటే ఏంటి? ఈబీ-5 వీసా ప్రోగ్రాం అంటే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలనుకునే విదేశీయులు మిలియన్ డాలర్ల పెట్టుబడితో స్టార్టప్ ఏర్పాటు చేయాలి. దానికి ప్రభుత్వం ఆమోద ముద్రవేస్తే… ఆ స్టార్టప్ లో […]


 • పెద్ద నోట్లకు నకిలీ నోట్లు! రంగంలోకి దిగిన ఎన్ఐఏ, బీఎస్ఎఫ్ దళాలు

  పెద్ద నోట్లకు ‘నకిలీ’ కరెన్సీ ట్రయల్ రన్ మొదలైంది. రూ.2 వేలు, రూ.500 నకిలీ నోట్లను ఐఎస్ఐ భారత్ లో ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఈ నకిలీ కరెన్సీ బాగోతం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), సరిహద్దు రక్షణ దళాలు (బీఎస్ఎఫ్) రంగంలోకి దిగాయి. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ, రెండు వేల రూపాయల నకిలీ నోట్లు నలభై తీసుకువెళుతున్న అజిజుర్ రహమాన్ (26) అనే వ్యక్తిని […]


 • నాకు దెబ్బ తినడం మాత్రమే కాదు..

  దెబ్బ తీయడం కూడా వచ్చు: పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అంతిమ లక్ష్యం అధికారం కాదని… ప్రజా శ్రేయస్సు అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును, ఇమేజ్ ను ప్రజాసేవ కోసమే ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. అమెరికాలోని న్యూహాంప్ షైర్ లో మీట్ అండ్ గ్రీట్ కు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు దెబ్బ తినడం మాత్రమే కాదు, […]


 • భారతీయుల ‘గ్రీన్‌కార్డు’ ఆశలపై నీళ్లు?

  స్థానికులకే ఉద్యోగావకాశాలను పెంచే దిశగా కఠినమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్న అమెరికా మరో పిడుగులాంటి ప్రతిపాదనను కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే హెచ్‌1బీ వీసాలను తగ్గించేలా కార్యనిర్వాహక ఆదేశాలు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు భారత అమెరికన్లకు తీవ్ర ప్రభావం చూపేలా గ్రీన్‌కార్డు (అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పర్చుకునే)ల సంఖ్యను సగానికి తగ్గించే బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. అమెరికాలోకి వస్తున్న వలసలను పదేళ్లలో సగానికి తగ్గించే ఉద్దేశంతో రూపొందించిన రైజ్‌ (ద రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌) బిల్లును డెమొక్రటిక్‌ […]


 • ఎక్కడా ఆగకుండా 10 టైమ్ జోన్ లను దాటొచ్చి రికార్డు సృష్టించిన ఖతార్ విమానం

  ప్రపంచంలో అత్యధిక దూరాన్ని ఆగకుండా ప్రయాణించిన రికార్డును ఖతార్ ఎయిర్ వేస్ సొంతం చేసుకుంది. దోహా నుంచి ఆక్లాండ్ కు బయలుదేరిన ‘క్యూఆర్ 920’ సర్వీస్ నంబర్ విమానం మొత్తం 14,535 కిలోమీటర్లను ప్రయాణించి ఈ ఉదయం షెడ్యూల్ సమయానికి 5 నిమిషాల ముందుగా 7:25కు ఆక్లాండ్ చేరుకుంది. మొత్తం 16 గంటలా 23 నిమిషాల పాటు విమానం ప్రయాణించిందని, మార్గ మధ్యంలో 10 టైమ్ జోన్ లను దాటిందని ఖతార్ ఎయిర్ వేస్ తన ట్విట్టర్ […]


 • ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ…

  సలహాదారుల టీమ్ నుంచి తప్పుకున్న ఉబెర్ చీఫ్ ట్రావిస్ ఇమిగ్రేషన్ విధానాన్ని కఠినం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సలహా సంఘ సభ్యుడిగా సేవలందించడమేంటని తనపై వస్తున్న విమర్శలతో ఉబెర్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ట్రావిస్ కలానిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ బిజినెస్ అడ్వయిజరీ గ్రూప్ నకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. “ట్రంప్ సలహా సంఘంలో ఉన్నానంటే, ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతోనూ ఏకీభవిస్తున్నట్టు కాదు. ఆయన అజెండాను అంగీకరించినట్టు కాదు” అని […]


 • ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌

  ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో పిల్లిమొగ్గవేశారు. ‘ఇది ముస్లింలపై నిషేధంకాదు.. ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశాలను మీడియా వక్రీకరించింది’ అని వాపోయారు. సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్‌ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై స్వదేశంలోనేకాక ప్రపంచవ్యాప్తంగా […]


 • ఈసారి విశ్వసుందరి ఎవరో తెలుసా?

  విశ్వసుందరి కిరీటం ఈసారి ఫ్రాన్స్‌ భామ ఇరిస్‌ మిథెనరిని వరించింది. మనీలాలో జరిగిన 2016 మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. ఇక ఈ పోటీలలో ఫస్ట్‌ రన్నరప్‌గా హైతీకి చెందిన రక్వెల్‌ పెలిసీర్‌, సెకండ్‌ రన్నరప్‌గా కొలంబియాకు చెందిన ఆండ్రియా తోవర్‌ నిలిచారు. మిస్‌ ఫ్రాన్స్‌ అయిన 23 ఏళ్ల మిథెనరీ ప్రస్తుతం డెంటల్‌ సర్జరీలో డిగ్రీ అభ్యసిస్తున్నది. దంతాలు, నోటి శుభ్రత గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను మిస్‌ యూనివర్స్‌ వేదికను […]


 • ఇమిగ్రేషన్‌పై కొరడా

  ఇప్పటికే ఒబామాకేర్‌ను రద్దుచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. వలసవాదులపై కఠినంగా వ్యవహరించటం, మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టడంపై ఈ వారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వలస విధానంలో ముస్లిం దేశాల నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయటంపైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇరాక్, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్‌ వంటి దేశాలనుంచి వలసలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేయటమా లేక.. శాశ్వతంగా నిరోధించటమా అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. Trump, thwart, migrants,


 • డోనాల్డ్ ట్రంప్ రాత్రి ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేయనున్నారు….

  డోనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేయనున్నారు. 11-30 గంటలకు ట్రంప్ ఫోన్ చేస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.  రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా ప్రపంచశాంతి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీకి మంచి స్నేహం ఉండేది.  ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరచూ భారతీయులపై విరుచుకుపడ్డారు. అమెరికా ఉద్యోగాలన్నీ ఇండియన్స్ ఎగరేసుకుపోతున్నారని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్‌ను అడ్డుకుంటామని హెచ్-1బి వీసాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తూ వచ్చారు.