విద్యా విధానంలో అంతరాలు తొలగాలి

ప్రస్తుత విద్యావిధానంలో ఉన్న అంతరాలు తొలగిపోవాల్సిన అవసరముందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఇందులో కోదండరాం మాట్లాడుతూ చదువులో అన్నివర్గాల ప్రజలకు సమానావకా శాలు అభించడం లేదనీ, కొందరిని నిరాదరణ వెంటాడుతోందన్నారు.
ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదన్నారు. విద్యార్థులు సంఘటిత శక్తిగా మారితేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందన్నారు.
Education, Professor kodanda Ram, SFI state conference