గంగూలీకి బెదిరిపు లేఖ..!

తనుకు బెదిరింపు లేఖ అందిందని మాజీ కెప్టెన్‌, క్యాబ్‌ అద్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సోమవారమిక్కడ తెలిపాడు. ఈ నెల 19న మిడ్నాపూర్‌లో విద్యాసాగర్‌ యూనివర్శిటీలో జరిగే ఇంటర్‌ కాలేజ్‌ క్రికెట్‌ మీట్‌ ఫైనల్‌కు హాజరుకావద్దని.. ఒకవేళ వస్తే ‘ప్రాణ హాని’ ఉంటుందని హెచ్చరిస్తూ ఓ అగంతకుడు లేఖ రాసినట్టు సౌరవ్‌ చెప్పాడు. అయితే లేఖ గంగూలీకి నేరుగా కాకుండా అతడి అమ్మ నిరుపమ పేరుమీద రాశాడు. శనివారం ఈ లేఖ అందిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సౌరవ్‌ తెలిపాడు.