నా కారును అవమానిస్తావా అంటూ..!

తన క్యాబ్ పట్ల ప్యాసింజర్ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాడని(డోర్ గట్టిగా క్లోజ్ చేశాడని) అతడిపై డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. క్షణికావేశంలో దాడికి పాల్పడి చివరికి జైలుపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్ లో గత శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జాకబ్ మథ్యూ అల్లెమాన్ అనే వ్యక్తి ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం ఓ జంట అతడి క్యాబ్ ఎక్కింది. వారు వెళ్లాల్సిన చోటుకు వెళ్లిన తర్వాత కారు దిగే సమయంలో 49 ఏళ్ల ప్యాసింజర్ (భర్త) డోర్‌ను క్లోజ్ చేసేందుకు తన్నాడు.

ఆగ్రహించిన క్యాబ్ డ్రైవర్ జాకబ్ మథ్యూ ప్యాసింజర్ ఛాతీ, తల భాగాలపై కత్తితో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. టౌన్ షిప్ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి భార్య మాట్లాడుతూ.. కేవలం కారు డోర్ గట్టిగా పుష్ చేసినందుకే అన్యాయంగా తన భర్తపై చేయ్యి చేసుకున్నాడని, కత్తితోనూ దాడిచేశాడని ఆరోపించింది. తన భర్తకు రక్తం కారడంతో ఎంతో భయాందోళనకు గురైనట్లు పోలీసులకు వివరించింది.
Uber driver, vehicle disrespected, passenger stabbed,