‘భూమిని నమ్ముకుని బతుకుతున్నాం..

 

madhadev-pur

 

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద బుధవారం నిర్వాసిత రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.  బుధవారం మేడిగడ్డలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి జాయింట్‌ కలెక్టర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.  ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.7.50 లక్షల వరకు చెల్లిస్తామన్నారు.  అయితే, ప్రాణాలు పోయినా సరే ఆ రేటుకు భూమలు ఇవ్వబోమని.. ఎకరానికి రూ.20 లక్షలు, డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని, అర్హులైనవారికి ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. భూములి వ్వకున్నా బలవంతంగా ప్రాజెక్టులు పనులు ప్రారంభిస్తా మని జేసీ స్పష్టం చేశారు.