సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాం టికెట్టు ధర …..

sce

 

ప్రస్తుతం పది రూపాయలు ఉన్న టికెట్టు ధర ఇరవై రూపాయలు అవుతుందని ఇది ఈ నెల 10-16 తేదీల్లో అమల్లో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. సంక్రాంతి, అయ్యప్పల శబరిమలై యాత్ర నేపథ్యంలో రైల్వే స్టేషన్‌ ప్రయాణికులు, వారితో వచ్చే బంధువులతో కిక్కిరిసి పోతుంది. ఈ రద్దీని క్రమబద్ధీకరించేందుకే తాత్కాలికంగా ప్లాట్‌ ఫాం టికెట్టు ధరను పెంచుతున్నట్టు అధికారులు ప్రకటించారు.